బ్రేకింగ్ : తమిళ నటుడు వివేక్ కి హార్ట్ ఎటాక్..!?

తమిళ ప్రముఖ హాస్య నటుడు వివేక్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఆయనకు తీవ్ర గుండె నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు.కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అందరి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దాని పై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఎక్మో ట్రీట్‌మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల సిబ్బంది ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఇంకా చెన్నై ఓమందూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్‌ గురువారం కరోనా వ్యాక్సిన్‌ పొందారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి వివేక్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. కరోనా టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ వివేక్ ట్వీట్ కూడా చేశారు.

Share post:

Popular