దారుణం..ప‌సిబిడ్డ‌ను క‌డ‌తేర్చిన త‌ల్లి..ఎందుకో తెలిస్తే షాకే!

April 16, 2021 at 8:57 am

ఆరు నెల‌లు ఉన్న ప‌సి బిడ్డ‌ను క‌న్న త‌ల్లే క‌డ‌తేర్చింది. ఈ దారుణ ఘ‌ట‌న తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మూఢ న‌మ్మ‌కాలే ఈ విషాద ఘ‌ట‌న కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతికి, తండాకు చెందిన కృష్ణతో రెండున్నర ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

ఆరు నెలల క్రితమే ఈ దంపుత‌ల‌కు కుమార్తె పుట్టింది. అయితే ఎప్పుడూ యూట్యూబ్‌లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ గ‌డిపే భార‌తికి.. కొద్ది రోజుల క్రితం ఓ సాధువు నాగ‌దోషం ఉంద‌ని తెలిపాడు. దీంతో మాన‌సికంగా కృంగిపోయిన భార‌తి.. నాగ‌దోషం పోగొట్టుకోనేందుకు దారుణానికి ఒడిగ‌ట్టింది.

ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసుకుని.. క‌న్న‌బిడ్డ‌ను దేవుడి పటాల ముందు పడుకోబెట్టి కత్తితో గొంతుకోసి హతమార్చింది. అనంత‌రం భార‌తి రోధిస్తూ బ‌య‌ట‌కు రాగా.. ఆమెను గ‌మ‌నించిన స్థానికి అస‌లు విష‌యాన్ని తెలుసుకుని షాక్ తిన్నారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి భార‌తిని అదుపులోకి తీసుకున్నారు.

దారుణం..ప‌సిబిడ్డ‌ను క‌డ‌తేర్చిన త‌ల్లి..ఎందుకో తెలిస్తే షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts