వారి కోసం వెయ్యి పడకల ఆసుపత్రిని కట్టిస్త అంటున్న బాలీవుడ్ హీరో..!?

కరోనాతో బాధపడుతున్న జనాలను చూసి అల్లాడి పోయాడు ఆ నటుడు. కొవిడ్‌ పేషెంట్లకు సరైన వైద్యం అందించే హాస్పిటళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, చాలా మంది రోగులకు కనీసం బెడ్లు కూడా దొరకని స్థితి ఉండటం చూసి చలించిపోయాడు. ఈ క్రమంలో తనే ఓ ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రకటించాడు హిందీ నటుడు గుర్మీత్‌ చౌదరి. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్లను త్వరలోనే ప్రారంభిస్తానని ఆదివారం నాడు సోషల్‌ మీడియా వేదిక ద్వారా ప్రకటించాడు.

సామాన్య ప్రజలందరికి వైద్య సహాయం అందించడం కోసం సకల సౌకర్యాలతో వెయ్యి బెడ్స్ ఉన్న ఆస్పత్రి నిర్మిస్తానని గుర్మీత్‌ వెల్లడించాడు. తాను సంకల్పించిన ఈ ఆశయం నెరవేరేందుకు తనకు అందరు అండగా ఉంటారని ఆశిస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తానని గుర్మీత్‌ చౌదరి చెప్పాడు.

Share post:

Latest