ర‌ష్మిక‌కు రింగ్ పంపింది ఎవ‌ర‌బ్బా..ఆలోచ‌నలో ప‌డ్డ ఫ్యాన్స్‌!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రాలు లేద‌. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప‌`, శ‌ర్వానంద్ స‌ర‌స‌న `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో న‌టిస్తోంది ర‌ష్మిక‌.

అలాగే త్వ‌ర‌లోనే `సుల్తాన్` సినిమాతో కోలీవుడ్‌లోకి, `మిషన్‌ మజ్ను` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది ఈ బ్యూటీ. మొత్తానికి వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ర‌ష్మిక‌కు.. తాజాగా ఒక వ్య‌క్తి హోలీ పండగను పురస్కరించుకుని రింగ్ పంపాడు. ఈ విష‌యాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన ర‌ష్మిక‌.. `నువ్వు ఎవ‌రో నాకు తెలిసిపోయింది. నువ్వు పంపిన కానుక నాకు అందింది.

ఈ రింగ్‌ నాకు పర్ఫెక్ట్‌గా సెట్టయింది. చాలా నచ్చింది కూడా! పనిలో పనిగా నువ్వు రాసిన సీక్రెట్‌ మెసేజ్‌ కూడా చదివాను` అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఈ మేరకు వేలికి ఉంగరం తొడుక్కున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. దీంతో ర‌ష్మిక‌కు ఉంగ‌రం పంపిన ఆ వ్య‌క్తి ఎవ‌ర‌బ్బా అనే ఆలోచ‌న‌లో ప‌డ్డారు ఆమె ఫ్యాన్స్‌. రష్మిక సీక్రెట్‌ బాయ్‌ఫ్రెండ్ ఈ రింగ్ పంపుంటార‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest