`వ‌కీల్ సాబ్‌`పై ప‌వ‌న్ మాజీ భార్య రేణు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌యోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఈక్ర‌మంలోనే తాజాగా వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా.. సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే తాజాగా వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌పై ప‌వ‌న్ మాజీ భార్య‌, న‌టి రేణు దేశాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ ట్రైల‌ర్ లో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడని.. అమ్మాయి తరఫున నిలబడి వాళ్ల కోసం పోరాడే న్యాయవాది పాత్రలో ప‌వ‌న్ అద్భుతంగా క‌నిపించాడ‌ని రేణు తెలిపింది.

అలాగే ట్రైలర్‌లో పవన్ ఆటిట్యూడ్ అదిరిపోయిందని ఆమె ప్రశంసించింది. మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం ఆక‌ట్టుకుంద‌ని.. మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచేసింద‌ని..ఖ‌చ్చితంగా ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని రేణు పేర్కొంది. ఇక రేణు వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Share post:

Latest