ర‌వితేజ‌కు షాక్‌..ఆగిపోయిన `ఖిలాడి` షూటింగ్?

మాస్ మ‌హారాజా ర‌వితేజ తాజా చిత్రం `ఖిలాడి`. రమేష్‌ వర్మ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ‌కు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

అలాగే ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇటీవ‌లె చిత్ర యూనిట్ ఇటలీకి వెళ్లింది. అక్క‌డ కొంత షూటింగ్ కూడా జ‌రిగింది. ఇటలీ షెడ్యూల్‌ దాదాపు పూర్తయ్యే తరుణంలో ర‌వితేజ‌కు మ‌రియు చిత్ర యూనిట్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది.

తాజాగా ఇట‌లీలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించారు. దీంతో ఖిలాడి షూటింగ్ ఆగిపోయింది. ఇక లాక్‌డౌన్ నేప‌థ్యంలో మూవీ యూనిట్ కూడా హైదరాబాద్‌కు వెనుదిరిగి వ‌చ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి కొన్ని రోజులు అక్కడే ఉండి షూటింగ్‌ను పూర్తి చేసుకుని వస్తారా? లేక మిగిలిన షూటింగ్‌ను ఇక్కడి లొకేషన్స్‌లో ముగించే ప్లాన్ చేసుకుంటారా? అన్న‌ది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

Share post:

Latest