న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో `టక్ జగదీష్` చిత్రాన్ని పూర్తి చేసిన నాని..రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగరాయ్`ను పట్టాలెక్కించేశాడు. ఇక ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ‘అంటే సుందరానికి’ సినిమా చేయనున్నాడు.
ఇదిలా ఉంటే.. నాని తాజాగా మరో ప్రాజెక్ట్ను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో నాని మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జెర్సీ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘బెస్ట్ తెలుగు ఫిల్మ్’గా నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది.
అయితే తనకు హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరితోనే మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడట నాని. ఇప్పటికే గౌతమ్ నానికి కథ చెప్పగా.. అది బాగా నచ్చడంతో ఈ ఏడాది నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా సెట్స్ మీదకు తీసుకువెళ్లదామని నాని తెలిపాడట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. కాగా, ప్రస్తుతం గౌతమ్ జెర్సీ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.