పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఓవర్సీస్లో సాధించిన వసూళ్లు పెద్ద హీరోలకే దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇచ్చాయి. ఈ సినిమా తర్వాత విజయ్ ద్వారక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్‌రెడ్డి.
రిలీజ్‌కు ముందే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఓ సంచలనమయ్యాయి. ఈ సినిమా పోస్టర్లను కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు చింపేయడం, తర్వాత ఆర్జీవి కామెంట్స్, విజయ్ దేవరకొండ చేసిన కాంట్రవర్సీ ప్రసంగం, 187 నిమిషాల రన్ టైం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిన్న సినిమాకు కావాల్సినంత ప్రీ పబ్లిసిటీ దక్కింది.
ఇక శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు గురువారం ఓవర్సీస్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఓ పెద్ద హీరో సినిమాకు వేసినట్టు ప్రీమియర్ షోలు వేశారు. ఇక గురువారం ప్రీమియర్ షోలతోనే ఓవర్సీస్లో దిమ్మతిరిగిపోయే వసూళ్లు సాధించింది. అమెరికాలో ఈ సినిమాను నిర్వాణ సంస్థ పంపిణీ చేసింది.
అక్కడ 85 స్క్రీన్లలో ప్రీమియర్ షోల ద్వారా 1.70 లక్షల డాలర్లు (మన కరెన్సీలో 1.28 కోట్లు) కలెక్ట్ చేసింది. ఓ చిన్న సినిమాకు ఇవి నిజంగా చాలా గొప్ప వసూళ్లు. ఈ లెక్కన ఓవర్సీస్లో అర్జున్‌రెడ్డి వీరంగం ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.