ప్రిన్స్ మహేష్‌బాబు -మురుగదాస్ కాంబినేషన్లో వస్తోన్న స్పైడర్ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ కోసం అయినా మహేష్ ఫ్యాన్స్ కళ్లుకాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద ఎంత ఆసక్తితో ఉన్నారో దర్శకుడు మురుగదాస్ మాత్రం వారిని అంతకంతకు ఊరిస్తున్నాడు.
ఇక ఈ సినిమా టీజర్ కోసం ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తోన్న మహేష్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. మహేష్‌బాబు గత ఆరేళ్లుగా తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాల టీజర్ లేదా ఫస్ట్ లుక్‌లను రిలీజ్ చేసే సంప్రదాయాన్ని పాటిస్తున్నాడు.
ఈ సారి స్పైడర్ విషయంలో సైతం అదే సంప్రదాయాన్ని పాటిస్తూ స్పైడర్ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారని మహేష్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పైడర్ సినిమా టీజర్ కూడా ఈ నెల 31న రిలీజ్ అవుతుందని భావించారు ఫ్యాన్స్. అయితే దర్శకుడు మురుగదాస్ మాత్రం టీజర్ రిలీజ్ చేయడం లేదట.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను హడావిడిగా కట్ చేసి రిలీజ్ చేస్తే నష్టమే ఎక్కువ జరుగుతుందని భావించిన మురుగదాస్ టీజర్‌కు మరింత టైం తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ఈ విషయం బయటకు లీక్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.