ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసిన బాహుబలి-2 ది కంక్లూజన్ విడుదలైంది. ఈ మూవీ ఇప్పుడు మామూలు ప్రేక్షకులనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరోలను సైతం మంత్రముగ్ధులను చేసింది. ఈ మూవీ దెబ్బకి ఇప్పటికే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాహుబలి-2 ఫీవర్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. నిమిషం కూడా తీరిక దొరకని కలెక్టర్లు, మంత్రులు కూడా బాహుబలి-2ను చూసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
అదేవిధంగా టాలీవుడ్‌లోనూ బాహుబలి-2 ఫీవర్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే, ఈ మూవీ ఎప్పుడెప్పుడొస్తుందా? అని తన ఉత్కంఠను ఇటీవల ఓ ఫంక్షన్లో వెల్లడించేశాడు కూడా. ఇక, అలాంటి రోజు రావడంతో జూనియర్ తన సంతోషాన్ని ప్రస్తుతం తన మూవీ యూనిట్‌తో పంచుకున్నాడు. జై లవకుశ మూవీ షూటింగ్లో తారక్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం బాహుబలి-2 రిలీజ్ ఉండడంతో తన మూవీ యూనిట్‌కి సెలవు ప్రకటించేశాడు తారక్.
నిజానికి ఇప్పుడు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా షూటింగ్ జరపాల్సి ఉన్నప్పటికీ.. తారక్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటే బాహుబలిని తారక్ ఎంత లైక్ చేస్తున్నాడో తెలుస్తోంది. అలాగే రాజమౌళితో కలిసి ఈ వీకెండ్లోనే బాహుబలి-2 సినిమాను చూస్తున్నాడు ఎన్టీఆర్. అసలే రాజమౌళి తర్వాత సినిమా ఎన్టీఆర్తోనే అన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ గెశ్ఛర్తో ఇంకాస్త ఆశలు కల్పించాడు ఎన్టీఆర్.
వెతికితే తప్పులు డోర్లని,తప్పులు దొరకని సినిమా ఉండదు..ఇందులోనూ తప్పులుండొచ్చు, సెకండ్ హాఫ్ లో పేస్ తగ్గిండొచ్చు గాక..ఇవేవి సినిమాని ఆపలేవు.ఇది చరిత్ర.ఒక్క బలమైన సన్నివేశం చాలు సినిమా దశ దిశను మార్చేయడానికి..అలాంటివి సినిమా ఆద్యంతం ఉంటే అదే బాహుబలి.