బాబు నుంచి జూనియర్ భలే ఎస్కేప్… లేకుంటే ?

మ‌నం అనుకుంటాం కానీ, అంతా ఆల‌స్యం అయిపోతోంది! అంతా ఆల‌స్యం అయిపోతోంది! అని!! ఒక్కొక్క‌సారి ఆ ఆల‌స్య‌మే.. ఎంతో మేలు చేస్తుంద‌ట‌! ఇప్పుడు ఇదే విష‌యం తార‌క్ విష‌యంలోనూ జ‌రిగింద‌ని తెలుస్తోంది. అదేంటంటే.. మొన్నామ‌ధ్య ఉధృతంగా తెర‌మీద‌కి వ‌చ్చిన త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు విష‌యం.. అంద‌రికీ తెలిసిందే. దీనిపై సాధార‌ణ ప్ర‌జ‌లు కోలీవుడ్ రోడ్ల మీద‌కి సైతం వ‌చ్చి పోరాడారు. అదే స‌మ‌యంలో కొంద‌రు టాలీవుడ్ హీరోలు సైతం త‌మ స్టైల్లో స్పందించారు. మ‌హేష్ బాబు, ప‌వ‌న్ ఇలా ప‌లువురు హీరోలు రియాక్ట్ అయ్యారు.

ఈ కామెంట్ల‌పై కొన్ని పాజిటివ్ రిప్ల‌య్‌లు రాగా.. మ‌రికొన్ని నెగెటివ్ కామెంట్లు వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలో మ‌న తార‌క్ కూడా జ‌ల్లిక‌ట్టుపై ట్వీట్ చేద్దామ‌ని అనుకున్నాడ‌ట‌. అయితే, ఎందుకో అనుకున్న స‌మ‌యానికి కుద‌ర‌లేదు. ఇక‌, ఇంత‌లో మ‌హేష్ పెట్టిన ట్వీట్‌పై వ‌ర్మ చేసిన కామెంట్లు చిర్రెత్తుకొచ్చాయ‌ట‌. దీంతో మ‌రోరోజు తార‌క్ వెన‌క్కి త‌గ్గాడ‌ట‌. ఇదిలావుంటే.. జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తితో ఏపీలో ప్ర‌త్యేక హోదా కోసం యువ‌త న‌డుం బిగించారు. దీంతో రెండు మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్త‌మైంది.

దీనికి కూడా ప‌వ‌న్ మ‌ద్ద‌తు తెల‌ప‌గా.. మ‌హేష్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే.. ఆయ‌న బావ సాక్షాత్తూ.. టీడీపీలో ఎంపీగా ఉండ‌డమే. దీంతో మ‌హేష్‌పై ఇక్క‌డ పెద్ద ఎత్తున కామెంట్లు కురిశాయి. ఇక‌, తార‌క్ విష‌యానికి వ‌స్తే.. మంచే జ‌రిగింద‌ట‌! జ‌ల్లిక‌ట్టుపై స్పందించి ఉంటే.. ఏపీపైనా స్పందించాల్సి వ‌చ్చేద‌ని, అదే జ‌రిగితే.. మేన‌మామకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన వాళ్లం అవుతామ‌ని ఇది ఇప్ప‌టికే ఉన్న విభేదాల‌ను మ‌రింత‌గా పెంచేద‌ని తార‌క్ అనుకున్నాడ‌ట‌. అటు జ‌ల్లిక‌ట్టుపై కామెంట్లు చేయ‌డంలో జరిగిన జాప్యం త‌న‌కు ఇలా మేలు చేయ‌డం మంచిదైంద‌ని అనుకున్నాడ‌ట‌.