షాకింగ్ రేటుకు ఖైదీ నెంబ‌ర్ 150 శాటిలైట్ రైట్స్‌

మెగాస్టార్ చిరంజీవి ద‌శాబ్దాం గ్యాప్ తీసుకుని హీరోగా రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా ఖైదీ నెంబ‌ర్ 150. చిరు కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 150వ సినిమాగా తెర‌కెక్కుతుండ‌డంతో ఈ సినిమాపై కేవ‌లం మెగా ఫ్యామిలీ అభిమ‌నుల్లోనే కాకుండా టాలీవుడ్ సినీజ‌నాలు, ట్రేడ్‌వ‌ర్గాలతో పాటు రాజ‌కీయ‌వర్గాల్లో కూడా కాస్తో కూస్తో అంచ‌నాలు ఉన్నాయి.

త‌మిళ్‌లో హిట్ అయిన క‌త్తి సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాకు టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు అదిరిపోయే రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది.

ట్రేడ్ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు అన్ని ఏరియాల రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ క‌లుపుకుని రూ.100 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఖైదీ నెంబ‌ర్ 150 శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ టీవీ ఛానెల్ ఒకటి రూ. 13 కోట్ల రికార్డ్ మొత్తానికి కొనుగోలు చేసిందట.

ఈ రేటు మెగాస్టార్ కేరీర్‌లోనే హ‌య్య‌స్ట్ రేటుగా రికార్డుల‌కు ఎక్కింది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమా ఏ స్థాయిలో వ‌సూళ్లు సాధిస్తుందా అని అంద‌రూ ఆతృత‌గా వెయిట్ చేస్తున్నారు.