మోడీ దెబ్బకు ఆ టాలీవుడ్ హీరో కుదేలు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన క‌రెన్సీ స్ట్రైక్స్ దెబ్బ‌కి దేశ వ్యాప్తంగా రియ‌ల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. న‌ల్ల ధ‌నంపై మోడీ ర‌ద్దు పాదం మోప‌డంతో వేసిన వెంచెర్లు వేసిన‌ట్టే ఉంటున్నాయి త‌ప్ప‌.. కొనేవాళ్లు, పెట్టుబ‌డులు పెట్టేవాళ్లు క‌రువవుతున్నారు. ఇప్పుడు ఈ బాధ టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి కూడా ప‌ట్టుకుంద‌నే టాక్ వ‌చ్చింది. దీనికి సంబంధించిన ఓ విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. టాలీవుడ్‌లో ఎదుగుతున్న ఓ హీరో రెండు మూడు హిట్స్‌తో బాగానే వెనుకేసుకున్నాడు.

ఆయ‌న అలా ఉండ‌కుండా రియ‌ల్ బిజినెస్‌లోకి దిగాడు. దాదాపు 200 కోట్ల రూపాయ‌ల‌కు పైనే హైద‌రాబాద్ శివార్ల‌లో పెట్టుబ‌డులు పెట్టి భూములు కొనుగోలు చేసి వెంచ‌ర్లు కూడా వేసిన‌ట్టు స‌మాచారం. ఇలా ఇంత భారీ మొత్తంలో స్థిరాస్థుల‌పై పెట్టుబ‌డి పెట్టి అంత‌కు డ‌బుల్ మొత్తం రాబ‌ట్టాల‌ని ప్లాన్ వేశాడ‌ట ఆ హీరో. అంతేకాదు, పెద్ద నోట్ల ర‌ద్దుపై మోడీ ప్ర‌క‌ట‌న‌కు ముందు రోజు ఓ విలువైన ఆస్థిని కూడా కొనుగోలు చేశాడ‌ట‌. బ్లాక్ సొమ్ము వైట్ అయిపోయింది. దీంతో హ్యాపీ అనుకున్నాడు.

కానీ, ఇంత‌లో ఆయ‌న కొన్నా స్థిరాస్తి వెంచ‌ర్ల‌ను కొనేవారు లేక ఇప్పుడు స‌త‌మ‌త‌మ‌వుతున్నాడ‌ట‌. మోడీ దెబ్బ‌కి ఇల్లు గ‌డ‌వ‌డ‌మే అంతంత మాత్రం అయిపోయిన నేప‌థ్యంలో ఇళ్లు కొనే ప‌రిస్థితి లేక‌పోవ‌డం ఈ హీరోకి పెద్ద షాక్ ఇచ్చింద‌ట‌. డ‌బ్బుల‌న్నీ ఓచోట ఆగి పోవ‌డంతో ఇప్పుడా హీరో ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంద‌ని తెలుస్తోంది. మ‌రోప‌క్క ఇప్పుడు న్న ప‌రిస్థితిలో రియ‌ల్ ఎస్టేట్ రంగం కుదుట ప‌డ‌డానికి చాలా టైమ్ ప‌ట్టేట్టుంది.

అంతేకాకుండా ఇప్పుడున్న రేట్లు అప్పుడు ఉండ‌క‌పోవొచ్చు కూడా! దీంతో ఈ హీరో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అంటున్నారు. మాట‌లో మాట‌.. ఈ హీరోకి ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా ఉంది. ఆ సంస్థ‌లో త‌ర‌చూ సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు ఆ డ‌బ్బు కూడా రియ‌ల్ ఎస్టేట్‌లోనే బ‌దాలించ‌డంతో… త‌న కెరీర్ కూడా సందిగ్థంలో ప‌డిన‌ట్టైంది. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఎలా ఉంటుందో చూడాలి .