మ‌హేష్ స‌ల‌హాను ప‌క్క‌న పెట్టిన ప‌వ‌న్‌

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరూ హీరోల మార్కెట్ ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది. ఈ ఇద్ద‌రు టాప్ హీరోల‌లో మ‌హేష్ త‌న దృష్టంతా ప్ర‌స్తుతం సినిమాల‌పైనే కేంద్రీక‌రించి దూసుకువెళుతుంటే…ప‌వ‌న్ మాత్రం ఇటు వ‌రుస‌పెట్టి సినిమాలు చేయ‌డంతో పాటు జ‌న‌సేన ద్వారా రాజ‌కీయంగా కూడా యాక్టివ్ అయ్యాడు.

ఇదిలా ఉంటే తాజాగా ప‌వ‌న్‌కు మ‌హేష్ ఓ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. కొత్త ద‌ర్శ‌కుల జోలికి వెళ్ల‌కుండా టాప్ ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు చేయాల‌ని మ‌హేష్ ప‌వ‌న్‌కు చెప్పాడ‌ట‌. డాలీ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత ఏఎం.ర‌త్నం నిర్మాత‌గా తెర‌కెక్కే సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సినిమాకు త‌మిళ డైరెక్ట‌ర్ నీశ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

రీసెంట్‌గా నీశ‌న్ డైరెక్ట‌ర్ చేసిన త‌మిళ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మ‌హేష్‌, ప‌వ‌న్‌కు చెప్పి ఉంటాడ‌ని అంటున్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం మ‌హేష్ స‌ల‌హాను లైట్ తీస్కున్నాడ‌ని కూడా టాక్‌. డాలీ, త్రివిక్ర‌మ్ త‌ర్వాత నీశ‌న్ డైరెక్ష‌న్‌లో చేయ‌డానికే ప‌వ‌న్ క‌మిట్ అయ్యాడ‌ట‌.

ఇక మ‌హేష్ వ‌రుస‌గా టాప్ డైరెక్ట‌ర్ల‌తోనే క‌మిట్ అవుతున్నాడు. ప్ర‌స్తుతం మురుగ‌దాస్ త‌ర్వాత కొర‌టాల శివ‌, ఆ త‌ర్వ‌త త్రివిక్ర‌మ్‌తో సినిమాలు చేయ‌నున్నాడు.