బాహుబ‌లితో ముగ్గురు స్టార్ల బ్యాచిల‌ర్ లైఫ్‌కు శుభం కార్డు 

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి. గ‌త యేడాది రిలీజ్ అయిన బాహుబ‌లి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.600 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి…తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. ఇలాంటి సంచ‌ల‌న సినిమాకు కంటిన్యూగా తెర‌కెక్కిన బాహుబ‌లి 2 సైతం వ‌చ్చే యేడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్‌కు కార‌ణ‌మైంది.

ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు స్టార్ ల పెళ్లిళ్లు అవ‌నున్న‌ట్టు తెలుస్తోంది. బాహుబ‌లిలో బాహుబ‌లిగా న‌టించిన యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లిపై వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. బాహుబలి తరువాత ఈ యంగ్ రెబల్ స్టార్, ఓ ఇంటి వాడవుతాడంటూ స్వయంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గ‌తంలోనే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ పెద్ద‌లు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇక అదే టైంలో దేవ‌సేన అనుష్క పెళ్లి సైతం బాహుబ‌లి 2 రిలీజ్ అయిన వెంట‌నే ఉంటుంద‌ట‌. అనుష్క‌కు కుటుంబ స‌భ్యులు బెంగ‌ళూరుకు చెందిన ఓ వ్యాపార‌వేత్త‌తో ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అనుష్క ఏజ్ ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దులు దాటేసి 36 సంవ‌త్స‌రాల‌కు చేరుకుంది. దీంతో అనుష్క సైతం పెళ్లికి ఓకే చెప్పిన‌ట్టు టాక్‌.

ఇక భ‌ల్లాల‌దేవుడు రానా వ‌య‌స్సు కూడా మూడు ప‌దులు దాటేసింది. రానా పెళ్లిపై ఎలాంటి వార్త‌లు రాక‌పోయినా మ‌నోడు వ‌రుస పెట్టి హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డుపుతున్నాడ‌ని వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రానా పెళ్లిపై కుటుంబ సభ్యులు తొందర పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ ఒక్క సినిమా రిలీజ్ తరువాతే ఈ ముగ్గురు స్టార్లు బ్యాచిల‌ర్ లైఫ్‌కు బై చెప్ప‌నున్నారు.