బాల‌య్య సినిమాల‌కు బ్రాహ్మ‌ణి డైరెక్ష‌న్

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్నాడు. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై ఇండ‌స్ట్రీలోను, ట్రేడ్‌వ‌ర్గాల్లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాల‌య్య 101వ సినిమాపై అప్పుడే పెద్ద చ‌ర్చ కంటిన్యూ అవుతోంది.

ముందుగా బాల‌య్య 101వ సినిమాగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు సినిమా ఉంటుంద‌నుకున్నారు. దీనిపై ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. త‌ర్వాత ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ లైన్లోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత ప్లాప్ డైరెక్ట‌ర్ ఎస్‌వి.కృష్ణారెడ్డి పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది.

వ‌రుస ప్లాపుల‌తో పాటు త‌న‌కు గ‌తంలో టాప్‌హీరో వంటి అట్టర్ ఫ్లాప్ సినిమాను ఇచ్చిన డైరెక్టర్, అందులోనూ ప్రస్తుతం అసలు ఫామ్‌లోనే లేని కృష్ణారెడ్డికి బాలయ్య చాన్స్ ఎలా ఇస్తున్నాడో అంటూ చాలా మంది షాక్ అయ్యారు. బాల‌య్య ఫ్యాన్స్ అయితే బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకున్నారు. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం బాల‌య్య ఎస్‌వి.కృష్ణారెడ్డిని ప‌క్క‌న పెట్టేశాడ‌ట‌.

బాల‌య్యకు లెజెండ్ త‌ర్వాత స‌రైన హిట్ ప‌డ‌లేదు. ఇటీవ‌ల త‌న తండ్రి సినిమాల‌ను బ్రాహ్మ‌ణి సైతం ఓ కంట గ‌మ‌నిస్తోంద‌ట‌. ఈ క్ర‌మంలోనే బ్రాహ్మ‌ణి కృష్ణ‌వంశీ – ఎస్‌వి.కృష్ణారెడ్డి సినిమాల‌ను ప‌క్క‌న పెట్టేయ‌మ‌ని తండ్రికి సూచించిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బ్రాహ్మ‌ణి సూచ‌న‌ల మేర‌కు ఈ రెండు ప్రాజెక్టుల‌కు బాల‌య్య మర్చిపోయిన‌ట్టు టాక్‌. మ‌రి బాల‌య్య 101వ ప్రాజెక్టు ఏంట‌న్న‌ది శాత‌క‌ర్ణి రిలీజ్ అయ్యాక కాని తేల‌దు.