బాల‌య్యా ఏంటి ఈ షాకింగ్ బిజినెస్‌…!

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈ పేరు ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, తెలుగు సినిమా ప్రేక్ష‌కుల నోళ్ల‌లో ఒక్క‌డే నానుతోంది. తాజాగా తిరుప‌తిలో జ‌రిగిన ఆడియో ఫంక్ష‌న్ త‌ర్వాత శాత‌క‌ర్ణిపై అంచ‌నాలు మ‌రింత తారాస్థాయికి చేరుకున్నాయి. బాల‌కృష్ణ వందో సినిమా కావ‌డం, ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆథారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ఈ సినిమా కోసం అంద‌రూ క‌ళ్ళ‌ల్లో ఒత్తులేసుకుని మ‌రీ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.

ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో చెప్ప‌డానికి శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ కు వ‌స్తోన్న స్పంద‌నే నిద‌ర్శ‌నం. ఇప్ప‌టికే ఈ ట్రైల‌ర్ ను 50 ల‌క్ష‌ల మంది వీక్షించారు.ఇదిలా ఉంటే శాత‌క‌ర్ణి ప్రి రిలీజ్ బిజినెస్ విష‌యంలో కూడా సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తున్నాడు. బాల‌య్య సినిమాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయినా రూ.50 కోట్లు వ‌సూలు చేయ‌లేదు. బాల‌య్య సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమా లెజెండ్‌. లెజెండ్ సినిమా రూ.44 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

శాత‌క‌ర్ణి ప్రి రిలీజ్ బిజినెస్ మాత్రం రూ.60 కోట్ల వ‌ర‌కు చేరుకుంది. సినిమా బడ్జెట్ రూ.55 కోట్లు అయ్యింది. నైజాం హ‌క్కుల్ని నితిన్ సంస్థ గ్లోబ‌ల్ సినిమాస్ 10 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఇక సీడెడ్, వైజాగ్ హ‌క్కుల్ని భారీ రేటుకు బాల‌య్య స‌న్నిహితుడు, నిర్మాత సాయి కొర్ర‌పాటి చేజిక్కించుకున్నాడు. ఈస్ట్ హ‌క్కుల్ని సాయి కొర్ర‌పాటితో క‌లిసి సురేష్ బాబు ద‌క్కించుకున్నాడు.

వెస్ట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య కేరీర్‌లో ఏ సినిమాకు ప‌ల‌క‌ని రీతితో టాప్ రేటుకు ఎల్‌వీఆర్ సొంతం చేసుకున్నారు. కృష్ణాలో బేక‌రీ ప్ర‌సాద్‌, నెల్లూరు భ‌ర‌త్ పిక్చ‌ర్స్‌, గుంటూర్ ఎస్ మూవీస్ సుధాక‌ర్ సొంతం చేసుకున్నారు. శాత‌క‌ర్ణి కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.40 కోట్ల మార్క్ బిజినెస్ క్రాస్ చేసేసింది.

ఇక ఓవ‌ర్సీస్, ఇత‌ర రాష్ట్రాల్లో క‌లుపుకుంటే రూ.60 కోట్ల ద‌గ్గ‌ర‌కు చేరుకుంది. క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్‌కుమార్ ఈ సినిమాలో ఓ రోల్‌లో న‌టించ‌డంతో క‌న్న‌డ నాట కూడా ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి శాత‌క‌ర్ణి హిట్ అవ్వాలంటే బాల‌య్య కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వాల్సిందే. ఓ వైపు చిరు ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ఉంది. ఆ సినిమా నుంచి పోటీని త‌ట్టుకుని బాల‌య్య శాత‌క‌ర్ణి వ‌సూళ్లు సునామి సృష్టించాలి.