నారా వారి మూవీలో మంచు హీరో

నారా రోహిత్ హిట్లు, ప్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఈ యేడాది ఇప్ప‌టికే రోహిత్ న‌టించిన తుంట‌రి – సావిత్రి – రాజా చెయ్యి వేస్తే – జ్యో అచ్యుతానంద – శంక‌ర సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో జ్యో అచ్యుతానంద మాత్ర‌మే మంచి హిట్ అయ్యింది. ఇక  ఈ ఐదు సినిమాల‌తో పాటు ప్ర‌స్తుతం అప్పట్లో ఒకడుండేవాడు మూవీని సైతం రీలీజ్‌కు రెడీ చేయిస్తున్నాడు.

సేమ్ టైంలో కథలో రాజకుమారి అనే ఇంకో సినిమాని కూడా లాగించేస్తున్నాడు. మహేష్ సూరపనేని అనే కొత్త డైరెక్టర్ తీస్తోన్న ఈ మూవీలో నమితా ప్రమోద్ హీరోయిన్. ఈ సినిమాలో ప‌లు ట్విస్టులు ఇచ్చేందుకు రోహిత్ రెడీ అవుతున్నాడ‌ట‌. ప‌లువురు స్టార్లు ఈ సినిమాలో గెస్ట్ అప్పీరియ‌న్స్‌ల‌తో షాకులు ఇస్తార‌ట‌.

క‌థ‌లో రాజ‌కుమారి సినిమాలో ప్లాష్ బ్యాక్ మొత్తం సినిమా బ్యాక్ గ్రౌండ్‌లో న‌డుస్తుంద‌ట‌.అందుకే ఫ్రెండ్లీ అప్పీరియ‌న్స్ ఇవ్వాల‌ని రోహిత్ అడ‌గ‌డంతో చాలా మంది సినిమా వాళ్లు గెస్ట్ అప్పీరియ‌న్స్‌కు రెడీ అవుతున్నార‌ట‌. మంచు లక్ష్మీ – నాగశౌర్య – అదాశర్మతో పాటు ఓ కీల‌క‌మైన పాత్ర‌కు మంచు మోహ‌న్‌బాబును సైతం రోహిత్ ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది.

ఆ పాత్ర మోహ‌న్‌బాబు చేస్తే పాత్ర పండ‌డంతో పాటు మూవీకి సైతం ప్ల‌స్ అవుతుంది. మోహ‌న్‌బాబుకు అటు నంద‌మూరి, ఇటు నారా ఫ్యామిలీస్‌తో మంచి రిలేష‌న్ ఉంది. గ‌తంలో య‌మ‌దొంగ సినిమాలో ఎన్టీఆర్‌తో య‌ముడిగా త‌ల‌ప‌డిన మోహ‌న్‌బాబు ఈ సారి నారా హీరో రోహిత్‌తో ఎలా ఫైట్ చేస్తాడో చూడాలి.