దుమ్ము రేపుతోన్న ఎన్టీఆర్ కొత్త సినిమా బిజినెస్ 

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ జ‌న‌తా గ్యారేజ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అంద‌రం చూశాం. గ్యారేజ్ యావ‌రేజ్ టాక్‌తో స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ కేరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్క‌డంతో పాటు టాలీవుడ్ ఆల్ టైం టాప్‌-3 సినిమాల‌లో ఒక‌టిగా నిలిచింది.

ఇక టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు వ‌రుస హిట్ల త‌ర్వాత ఎన్టీఆర్ క్రేజ్, బిజినెస్ మామూలుగా పెర‌గ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై టాలీవుడ్ సినీ అభిమానుల్లోను, ట్రేడ్ వ‌ర్గాల్లోను మ‌మూలుగా అంచ‌నాలు లేవు.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చినా బాబీపై న‌మ్మ‌కంతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టును అప్ప‌గించాడు. ఎన్టీఆర్ కేరీర్‌లో 27వ ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను క‌ళ్యాణ్‌రామ్ త‌న సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తుండ‌డంతో ఈ ప్రాజెక్టుకు ఎక్క‌డ లేని క్రేజ్ వ‌చ్చింది.

ఈ క్ర‌మంలోనే ఇంకా సెట్స్‌మీద‌కు వెళ్ల‌కుండానే ఈ సినిమాకు దిమ్మ‌తిరిగే బిజినెస్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అదిరిపోయే రేంజ్‌లో ప్రి రిలీజ్ బిజినెస్ చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకునేందుకు బ‌డా డిస్ట్రిబ్యూట‌ర్లు పోటీప‌డుతున్నారు. సీడెడ్‌లో ఓ బ‌డా డిస్ట్రిబ్యూట‌ర్ ఈ సినిమా హ‌క్కుల కోసం ఏకంగా రూ.14.75 కోట్లు ఆఫర్ చేశాడట.

ఈ రేటు ఫైన‌ల్ అయితే టాలీవుడ్ హిస్ట‌రీలోనే ఇదే రికార్డు అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ఏ సినిమా ఈ స్థాయిలో బిజినెస్ చేయ‌లేదు. ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ అత్య‌ధికంగా రూ.12 కోట్ల‌కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. మ‌రి ఎన్టీఆర్ సినిమా ఇక్క‌డ రూ 14.75 కోట్ల‌కు అమ్ముడైతే ప‌వ‌న్ రికార్డు ఖ‌ల్లాస్ అయిన‌ట్టే. సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తోన్న ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.