చంద్రబాబుపై విరుచుకు పడ్డ సుప్రీంకోర్టు లాయర్

ఆయ‌న పేరు ప్ర‌శాంత్ భూష‌ణ్. సుప్రీంకోర్టు లాయ‌ర్‌. అంతేకాదు.. ప్ర‌ముఖ సామాజిక ఉద్య‌మ కార్య‌క‌ర్త‌. అంతేకాదు, అన్నా హ‌జారే టీంలో ప్ర‌ముఖ నేత‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక‌, ఢిల్లీ స్థాపించిన ఆప్ పార్టీలో ఆయ‌న ప్ర‌ముఖ పాత్ర కూడా పోషించాడు. ప‌ర్యావ‌ర‌ణం స‌హా అవినీతి, అక్ర‌మాల‌పై పెద్ద ఎత్తున విరుచుకుప‌డే ప్ర‌శాంత్ భూష‌ణ్ పిల్ లాయ‌ర్‌(ప్ర‌జాప్ర‌యోజన వ్యాజ్యాల ప్ర‌ముఖ లాయ‌ర్‌)గా పెద్ద పేరుంది. ఇప్పుడు ఈయ‌న త‌న‌ ఆగ్ర‌హం అంతా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై చూపించారు. అంతేకాదు, ఆధారాల‌తో స‌హా రెచ్చిపోయారు.

చంద్ర‌బాబుది అంతా ప్ర‌చార ఆర్భాటంగా ప్ర‌శాంత్ ఢిల్లీలో రెచ్చిపోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఈ ప్ర‌చారం కోసం కొంద‌రు జ‌ర్న‌లిస్టుల‌ను బాబు కొనుగోలు చేశార‌ని, వారికి నెల నెలా జీతాల రూపంలో లంచాలు ఇచ్చి త‌న‌కు అనుకూలంగా క‌థ‌నాలు రాయించుకుంటున్నార‌ని ప్రశాంత్ తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. జర్నలిస్టులను చంద్రబాబు ఎలా వాడుకుంటున్నారో కూడా సోదాహ‌ర‌ణంగా ప్ర‌శాంత్ చెప్పుకొచ్చారు. బాబు తన సొంత డబ్బా వాయించుకునేందుకు ఇటీవల 25 మంది జర్నలిస్టులను నియమించుకున్నార‌ని భ‌యంక‌ర మైన బాంబు పేల్చారు.

చంద్రబాబును పొగుడుతూ కథనాలు సిద్ధం చేయడం – బాబుకు పాజిటివ్ గా స్టోరీలు రాసి వాటిని జాతీయ మీడియాకు చేరవేసి దేశం మొత్తం మీద చంద్రబాబు గ్రేట్ అనిపించడం ఈ జర్నలిస్టుల టీం పని. 25 మందికి ఒక్కొక్కరికి ఏకంగా 51 వేల 468 రూపాయల జీతం చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింద‌ని చెబుతూనే దీనికి సంబంధించిన అధికారిక ప‌త్రాన్ని ప్ర‌శాంత్ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు అధికారికంగానే జర్నలిస్టులకు లంచాలు ఇస్తున్నారు చూడండి అంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని ట్వీట్ చేశారు.

నిజానికి ప్ర‌శాంత్ భూష‌ణ్ నోరు ఎత్తారంటే.. నిజం లేకుండా మాట్లాడ‌ర‌ని ఢిల్లీలో ప్ర‌ధాని నుంచి సీఎం స్థాయి వ‌ర‌కు పెద్ద ఎత్తున ప్ర‌చారంలో ఉంది. సో.. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు.. త‌న‌కు ఢిల్లీలో ఎంతో ప‌లుకుబ‌డి ఉంద‌ని, తాను నిప్పున‌ని చెప్పుకుంటున్న క్ర‌మంలో ప్ర‌శాంత్ ఆరోప‌ణ‌లు నిజంగానే ఆయ‌న‌కు ఢిల్లీ గ‌ల్లీల్లో బాబు ప‌రువును తీసేస్తున్నాయి. మ‌రి దీనిపై ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతారో? టీడీపీ త‌మ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.