షాక్‌: లోకేష్ మంత్రి ప‌ద‌వికి మామ బాల‌య్య అడ్డు..!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ కొద్ది రోజులుగా టీడీపీలోను, ఏపీ ప్ర‌భుత్వంలోను ప‌ట్టు సాధించేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే లోకేష్‌కు త్వ‌ర‌లో జ‌రిగే కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో కేబినెట్ బెర్త్ క‌న్‌ఫార్మ్ అన్న వార్తలు కూడా వ‌స్తున్నాయి. లోకేష్‌ను అసెంబ్లీకి పంపాల‌నుకుంటే కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం బెస్ట్ ఆప్ష‌న్ అని కూడా బాబు భావిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

లోకేష్‌ను అసెంబ్లీకి పంప‌క‌పోతే ఆయ‌న్ను ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రిని చేస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే రీసెంట్‌గా లోకేష్‌కు షాక్ ఇచ్చే న్యూస్ ఒక‌టి ఏపీ పాలిటిక్స్‌లో లీక్ అయ్యింది. ఈ వార్త ఇప్పుడు జోరుగా ట్రెండ్ అవుతోంది. లోకేష్ మంత్రి కాకుండా లోకేష్ మామ‌, ప్ర‌ముఖ సినీ న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణే అడ్డుత‌గులుతున్నార‌ట‌.

బాల‌య్య త‌న‌కు సైతం మంత్రి ప‌ద‌వి కావాల‌ని ఒత్తిడి చేస్తుండ‌డంతో సీఎం చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఎటూ తేల్చుకోలేకే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ వాయిదా వేశార‌ని తెలుస్తోంది. అందుకే ద‌స‌రాకు అనుకున్న ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఇప్ప‌ట‌కీ కూడా జ‌ర‌గ‌లేద‌ని స‌మాచారం. చంద్ర‌బాబు సైతం ఒకానొక ద‌శ‌లో త‌న కుమారుడికి మంత్రి ప‌ద‌వి ఇస్తున్న‌ట్టు మీడియాకు సైతం లీకులు ఇచ్చారు. అయితే ఈ విష‌యంలో ఇప్పుడు సెడ‌న్‌గా చంద్ర‌బాబు సైతం సైలెంట్‌గా ఉండ‌డం ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ల‌కు తావిస్తోంది.

చంద్ర‌బాబు ఒకేసారి త‌న కుమారుడు లోకేష్‌కు, ఇటు బావ‌మ‌రిది బాల‌య్య‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌లేరు. ఇది తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. ఇక చంద్ర‌బాబు లోకేష్‌కు భ‌విష్య‌త్తులో టీడీపీ ప‌గ్గాలు ఇవ్వ‌డంతో పాటు ఫ్యూచ‌ర్‌లో ఏపీ సీఎంగా త‌న కొడుకునే కూర్చోపెట్టాల‌ని సైతం ప్లాన్లు వేస్తున్నారు. ఇక బాల‌య్య మంత్రి ప‌ద‌వి కోరిక‌ను కాదంటే అది నంద‌మూరి అభిమానుల‌ను హ‌ర్ట్ చేసే ప్ర‌మాదం ఉంది. దీంతో చంద్ర‌బాబుకు ఇప్పుడు బాల‌య్య‌-లోకేష్ విష‌యంలో మందు నుయ్యి – వెన‌క గొయ్యిగా ప‌రిస్థితి ఉంద‌న్న చ‌ర్చ‌లు టీడీపీలోనే వినిపిస్తున్నాయి. అప‌ర రాజ‌కీయ చాణుక్యుడిగా పేరున్న చంద్ర‌బాబు ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.