శాత‌క‌ర్ణిలో ట్విస్ట్‌ ఇవ్వనున్న బాలయ్య..

ఓల్డ్ మూవీలు దేవ‌దాసు, లైలా మ‌జ్నూ, ఆరాధ‌న వంటి వాటిలో మూవీ లాస్ట్‌కొచ్చేస‌రికి హీరో చ‌చ్చిపోవ‌డం, సెంటిమెంట్‌తో ఆడియ‌న్స్ క‌ళ్ల‌లో క‌న్నీళ్లు కార‌డం వంటివి ఉండేవి. వాస్త‌వానికి అప్ప‌ట్లో ఆ సీన్లే.. మూవీల‌ని సూప‌ర్ హిట్ చేసేవి. కానీ, ట్రెండ్ మారింది! ఇప్పుడొస్తున్న మూవీల్లో హీరోలు చ‌చ్చిపోయే సీన్ల‌ను ఆడియ‌న్స్ యాక్స‌ప్ట్ చేయ‌డం లేదు. ఎంత సెంటిమెంట్‌నైనా త‌ట్టుకుంటున్నారు త‌ప్ప‌.. మూవీలో హీరో చ‌చ్చిపోయే సీన్లు ఉంటే మాత్రం అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. దీనిని గ‌మ‌నించిన మ‌న డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు ఈ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

అయితే, చారిత్ర‌క మూవీల్లో ఇలా హీరో చ‌నిపోవాల్సి వ‌స్తే.. ఏంటి? ఎలా వాటిని తెర‌కెక్కించాలి?   జ‌క్క‌న్న మూవీ బాహుబ‌లిలోనూ హీరో ప్ర‌భాస్‌ని క‌ట్ట‌ప్ప చంపేసే సీన్ ఉంది. అస‌లు ఇదే మెయిన్ పాయింట్. ఇలాంటి వాటిని ట్రీట్ చేసేట‌ప్పుడు ఆడియ‌న్స్ సెంటిమెంట్‌ని దృష్టి పెట్టుకునే చేయాలి. ఇప్పుడు ఇదే స‌మ‌స్య మ‌న బాల‌య్య ప్ర‌తిష్టాత్మ‌క 100 వ మూవీకి వ‌చ్చింది. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చారిత్ర‌క మూవీ. దీనిని త‌న‌దైన స్టైల్లో తెర‌కెక్కిస్తున్నాడు క్రిష్‌. అయితే, మూవీ లాస్ట్‌లో శాత‌క‌ర్ణి మ‌ర‌ణిస్తాడు.

కానీ, బాల‌య్య అబిమానులు ఈ సీన్‌ని డైజెస్ట్ చేసుకోగ‌ల‌రా? అందునా ఇది బాల‌య్య‌కి 100 వ మూవీ కావ‌డంతో ఆడియ‌న్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అని పెద్ద ఎత్తున దీనిపై చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ట‌. కానీ, హిస్టారిక‌ల్ మూవీ కావ‌ట్టి శాత‌క‌ర్ణి మ‌ర‌ణించే సీన్‌ని త‌ప్ప‌కుండా షూట్ చేయాల‌ని డైరెక్ట‌ర్ క్రిష్ డిసైడ్ అయ్యాడ‌ట‌. అయితే, శాత‌క‌ర్ణి ఓ భ‌యంక‌ర‌మైన వ్యాధితో చ‌నిపోయిన‌ట్టు కాకుండా యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన‌ట్టు చిత్రీక‌రించాల‌ని క్రిష్ భావిస్తున్నాడ‌ట‌. ఇలాగైతే, బాల‌య్య అభిమానులు స‌హా ఆడియ‌న్స్ దీనిని రిసీవ్ చేసుకుంటార‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ట‌! సో.. శాత‌క‌ర్ణి మూవీలో బాల‌య్య అభిమానుల‌కు ట్విస్ట్ ఇలా ఉండ‌బోతోంద‌న్న మాట‌.