టాలీవుడ్‌లో న‌ల్ల‌ధ‌నం వైట్ అవుతోంది ఇలా

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం బ‌డాబాబుల గుండెళ్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోన్నా చాలా మంది సామాన్యులు మాత్రం ఈ నిర్ణ‌యంతో అష్ట‌క‌ష్టాలు  ప‌డుతున్నాడు. గ‌త వారం ప‌ది రోజులుగా బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద జ‌నాలు కిలోమీట‌ర్ల కొద్ది క్యూలో నుంచోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. సామాన్యుల ప‌రిస్థితి ఇలా ఉంటే కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన బ‌డాబాబులు మాత్రం త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని ఎలా మార్చుకోవాలా అని నానా తంటాలు ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే మ‌న తెలుగు సినిమా రంగంలో కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన కొంద‌రు బ‌డాబాబులు త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల‌ధ‌నం మార్చుకునేందుకు ఆసుప‌త్రుల‌ను అడ్డాగా మార్చుకుంటున్నార‌న్న టాక్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. మ‌రి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. తమ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తే 30 నుంచి 40శాతం కమీషన్ ఇస్తామని కార్పొరేట్ ఆసుపత్రులకు నిర్మాతలు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు.

హైద‌రాబాద్‌లోని కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో రోజుకు 5 -15 కోట్ల వ‌ర‌కు లావాదేవీలు జ‌రుగుతున్నాయి. కార్పొరేట్ ఆసుప‌త్రులు రోగుల నుంచి రోజుకు ల‌క్ష‌ల్లో గుంజుతుంటాయి. బ్యాంకులు ఆసుప‌త్రుల లావాదేవీల‌పై పెద్ద దృష్టి సారించ‌వు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ నిర్మాతలు, టాలీవుడ్‌లో ఉన్న నల్ల కుబేరులు ఆసుపత్రుల ద్వారా తమ నల్ల డబ్బును మార్చుకుంటున్నారు.

ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ నిర్మాతలతో డీల్స్ కుదుర్చుకుంటున్నారు. పేషెంట్స్‌కు వేసే బిల్లులో ఈ నల్ల సొమ్మును కూడా కలిపేయడంతో బ్యాంకులకు కూడా గుర్తించడం కష్టంగా మారింది. కొన్ని ఆసుప‌త్ర‌లు య‌జ‌మాన్యాలు అయితే పేషెంట్స్‌ను ఒప్పించి మ‌రీ దొంగ బిల్లులు క్రియేట్ చేసి ఈ న‌ల్ల‌ధ‌నాన్ని వైట్ మ‌నీగా మార్చేస్తున్నాయి.