చైతు – స‌మంత పెళ్లి డేట్ ఫిక్స్‌

అక్కినేని ఫ్యామిలీలో మూడో త‌రం హీరోలు అయిన కింగ్ నాగార్జున త‌న‌యులు అక్కినేని నాగ‌చైత‌న్య‌, అఖిల్‌ల పెళ్లిళ్లు వ‌చ్చే యేడాది జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఇప్ప‌టికే సిసింద్రీ అఖిల్ – అత‌డి ప్రేయ‌సి శ్రియ భూపాల్ రెడ్డి ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది. వీరి ఎంగేజ్‌మెంట్ డిసెంబ‌ర్ 9న అంగరంగ వైభవంగా జరగబోతోంది. హైదరాబాద్‌లోని జీవీకే హౌస్‌లో ఈ ఉత్స‌వం ఉంటుంది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి ఇన్విటేష‌న్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అఖిల్ – శ్రియ భూపాల్‌రెడ్డి పెళ్లి గురించి తెర‌ముందు అంతా జ‌రుగుతుంటే తెరవెనక మాత్రం నాగచైతన్య-సమంతపెళ్లి ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయ‌ట‌. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాల్లో న‌టిస్తాన‌ని చెప్పిన స‌మంత ప్ర‌స్తుతం రెండు తమిళ సినిమాలు ఒప్పుకుంది. ఈ సినిమాల్లో న‌టించేందుకు ఆమె చెన్నైలోనే మ‌కాం వేసింది.

 స‌మంత ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు చెన్నైలో తన పెళ్లి ఏర్పాట్లలో ఆమె బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. చైతూ-సమంత పెళ్లి చెన్నైలోనే జరుగుతుంద‌నే వార్త‌ల‌కు స‌మంత అక్క‌డ పెళ్లి ఏర్పాట్లు చేస్తుండ‌డం మ‌రింత బ‌లాన్ని ఇస్తోంది. ఇక చైతు – స‌మంత పెళ్లికి డేట్ కూడా ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది.

అఖిల్ – శ్రియ ఎంగేజ్‌మెంట్ అయ్యాక వీరి పెళ్లి డేట్ అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలుస్తోంది. అఖిల్-శ్రియలా ఎంగేజ్ మెంట్ లేకుండా డైరెక్టుగానే వీరు పెళ్లి చేసేసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. మార్చి చివ‌ర్లో లేదా ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో వీరి పెళ్లి కోసం రెండు డేట్ల‌ను నాగార్జున పండితుల‌కు చూపించి ఫిక్స్ చేశాడ‌ని..ఫైన‌ల్‌గా వీటిలో ఏదో ఒక‌టి ఫిక్స్ అవుతుంద‌ని స‌మాచారం.