99 సినిమాలు..100 రూపాయలు..బాలయ్యా మజాకా

అవును మీరు చదివింది నిజమే.ఇప్పటి వరకు 99 సినిమాల్ని పూర్తి చేసుకుని 100 వ సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నా నందమూరి నట సింహం బాలకృష్ణ అభిమానులు ఏదిచేసినా ఓ సరికొత్త ట్రెండ్ ని సెట్ చేస్తూ వుంటారు.సరిగ్గా ఇప్పుడు కూడా ఈ 99 సినిమాలు పూర్తయి 100 వ సినిమా దాదాపు ఇంకో 100 రోజుల్లో సంక్రాంతికి రాబోతుండగా రికార్డ్స్ పై కన్నేశారు బాలయ్య అభిమానులు.

రాయలసీమకి బాలయ్యకి ప్రత్యేక అనుబంధం వుంది.ప్రస్తుతం బాలయ్య అనంతపురం జిల్లా లోని హిందూపురం నుండే రాజకీయ ప్రస్తానం మొదలుపెట్టారు.ఇక సినిమాలపరంగా కూడా బాలయ్య రాయసీమ మార్కెట్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది.అందులోను కడప జిల్లా లోని ప్రొద్దుటూరు అంటే బాలయ్య వీరాభిమానులకు పెట్టింది పేరు.ఇప్పటికే బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా లెజెండ్ డబల్ ప్లాటినం జూబ్లీ.. అంటే 525 రోజుల పైనే ..అంటే 75 వారాల పాటు ప్రదర్శించి అర్చన థియేటర్ రికార్డు సృష్టించింది.

తాజాగా అదే అర్చనా థియేటర్ ఈ సారి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ పై కన్నేసేసింది.బాలయ్య ఇప్పటివరకు నటించిన 99 సినిమాల్ని ఒక్క టికెట్‌పైనే.. అది కూడా వంద రూపాయలకే అర్చన థియేటర్‌లో ప్రదర్శించబోతున్నారు.ఈ విషయాన్నీ థియేటర్ యాజమాని ఓబుల్ రెడ్డి కూడా ధ్రువీకరించాడు.దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన పోస్టర్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.