సిల్వ‌ర్ స్క్రీన్‌పై స‌చిన్ లైఫ్‌!

క్రికెట్ ఆరాధాకులకు మ‌రో పండ‌గ రానుంది! ఇప్ప‌టి వ‌ర‌కు ఫీల్డ్‌లో ఆడిన స‌చిన్‌నే చూసి మురిసిపోయిన అభిమానుల‌కు త్వ‌ర‌లోనే సిల్వ‌ర్ స్క్రీన్‌పైనా స‌చిన్ లైఫ్ చూసి ఆనందించే ఛాన్స్ వ‌స్తోంది.  క్రీడాకారుల జీవితాలకు వెండితెర మీద కాసుల పంట పండుతుండటంతో ఆ దిశగా వారి స్టోరీల‌తో సినిమాలు తెర‌కెక్కించేందుకు మరింత మంది నటులు, దర్శకులు, నిర్మాతలు అడుగులు వేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు అజారుద్ధీన్, ఎమ్ ఎస్ ధోనిల జీవిత చరిత్రలు వెండితెర మీద సందడి చేశాయి. ధోనీ సినిమాకు అన్ని భాష‌ల్లోను అదిరిపోయే స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే రూ.100 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టి మ‌రిన్ని వ‌సూళ్ల దిశ‌గా దూసుకుపోతోంది. ఇక ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు లెజెండ్రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ లైఫ్ కూడా వెండితెరకు ఎక్క‌నుంది.

క్రికెట‌ర్ల స్టోరీలు వెండితెర‌మీద‌కు వ‌స్తుండ‌డంతో స‌చిన్ అభిమానులు కూడా త‌మ అభిమాన హీరో స్టోరీ ఎప్పుడు సినిమాగా వ‌స్తుందా ?  అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ విష‌యంపై స్పందించిన బాలీవుడ్ యంగ్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.  ‘ ప్రస్తుతం బాలీవుడ్ లో వస్తున్న బయోపిక్స్ అన్నీ.., ఇన్స్ పైరింగ్ గా ఉన్నాయి. నాకు వ్యక్తిగతంగా యువరాజ్ సింగ్ జీవితకథ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అతడి కెరీర్ లో చాలా విషయాలు ఉన్నాయి. వ్కక్తిగతంగా క్రీడాకారుడిగా ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొన్నాడు యువి. అతని జీవితకథ సినిమాగా రూపొందిస్తే మరింత ఇన్స్ పైరింగ్ గా ఉంటుంది అన్నాడు. అంటే మొత్తానికి క్రికెట‌ర్ల లైఫ్ స్టోరీలు మూవీలుగా రాబోతున్నాయ‌న్న‌మాట‌.