షాక్‌: ప‌వ‌న్ వ‌ద్దు…సాయి ధ‌ర‌మ్ ముద్దు

ఈ హెడ్డింగ్ నిజంగానే పెద్ద షాక్ లాంటిది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో న‌టించే ఛాన్స్ వ‌స్తే ఏ అమ్మాయి అయినా వ‌దులుకుంటుందా..?  అలాంటిది ప‌వ‌న్‌తో ఏకంగా ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వ‌స్తేనే రిజెక్ట్ చేసిన ఓ అమ్మ‌డు ఇప్పుడు ప‌వ‌న్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో స్పెష‌ల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది.

బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టించిన హాట్ యాంక‌ర్ ఇప్ప‌డిప్పుడే వెండితెర మీద కూడా  సత్తా చాటేందుకు ప్లాన్ చేసుకుంటుంది. సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున మరదలిగా న‌టించి ఓ సాంగ్‌లో నాగ్‌తో ఆడిపాడిన ఈ అమ్మ‌డు త‌ర్వాత థ్రిల్ల‌ర్ మూవీ క్షణం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఈ బ్యూటి ఇప్పుడు మరో కొత్త అవతారం కనిపించేందుకు రెడీ అవుతోంది.

గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. భారీ రేటు కూడా ఆమెకు ఆఫ‌ర్ చేశారు. ఆ ఛాన్స్‌ను ఆమె రిజెక్ట్ చేయ‌డంతో అది త‌ర్వాత హంసానందినికి వెళ్లింది. అయితే ఇప్పుడు ప‌వ‌న్ మేన‌ల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు అనసూయ ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది.

అయితే అప్పుడు వెండి తెర మ‌జా తెలియ‌క ప‌వ‌న్ ప‌క్క‌న సాంగ్ చేసే ఛాన్స్‌ను ఆమె వ‌దులుకుంద‌ని..ఇప్పుడు ఇక్క‌డ క్రేజ్ తెలుసుకుని సాయితో ఐటెం సాంగ్‌లో చిందేసేందుకు ఓకే చెప్పింద‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌.