మ‌హేష్ సినిమాకు మెగాస్టార్ టైటిల్‌

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. రూ.90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా మురుగ‌దాస్ స్టైల్లో మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా తెర‌కెక్కుతోంద‌ని తెలుస్తోంది. మ‌హేష్‌బాబు స‌ర‌స‌న ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా టైటిల్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాకు ఎనిమీ – ఏజెంట్ శివ – అభిమ‌న్యుడు అంటూ ర‌క‌ర‌కాల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అయితే ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో టైటిల్ ఈ సినిమా గురించి ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మెగాస్టార్ చిరు 150వ సినిమాకు ముందుగా క‌త్తిలాంటోడు అనే టైటిల్ పెట్టాల‌ని అనుకున్నారు. ద‌ర్శ‌కుడు వినాయ‌క్ ఈ టైటిల్‌ను ఎంతో ఇష్టంతో ఫిక్స్ చేశారు.

ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్‌కు ఈ టైటిల్ న‌చ్చ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు ఖైదీ నెంబ‌ర్ 150 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు ఈ క‌త్తిలాంటోడు టైటిల్‌ను మ‌హేష్‌బాబు సినిమాకు ప‌రిశీలిస్తున్న‌ట్టు లేటెస్ట్ అప్‌డేట్‌.  ఏజెంట్ శివ అనే పేరుతో పాటు కత్తిలాంటోడు అనే టైటిల్‌ను ఈ చిత్ర యూనిట్ సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తోంద‌ట‌.

అయితే తెలుగు-త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు అక్క‌డ ఇక్క‌డా క‌లిపి ఓకే టైటిల్ పెడితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ప్లాన్‌. మ‌రి దీపావ‌ళికి ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. ఆ లుక్‌తో పాటే టైటిల్ కూడా ఎనౌన్స్ చేయ‌నున్నారు. మ‌రి ఫైన‌ల్‌గా ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో చూడాలి.