చంద్ర‌బాబు దెబ్బ‌కు వ‌ణికిన టైగ‌ర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కోప మొచ్చింది! అది అలాంటి ఇలాంటి కోపం కాదు. సొంత పార్టీ ఎమ్యెల్యే పైనే క‌ట్ట‌లు తెగే కోప‌మొచ్చింది. ఇంకేముంది ఉన్న‌చోట ఉన్న‌ట్టుగానే ఫైరైపోయారు. స‌ద‌రు ఎమ్మెల్య‌ను చ‌డామ‌డా తిట్టిపోశారు. దీంతో ఆ ఎమ్మెల్యేకి గిర్రున నీళ్లు తిర‌గినంత ప‌నైంద‌ట‌! దీంతో ఎన్న‌డూ త‌న జీవితం క్ష‌మించ‌మ‌ని ఎవ్వ‌రినీ అడ‌గ‌నివాడు.. సీఎంను ప‌ట్టుకుని క్ష‌మించ‌మ‌ని అడ‌గ‌డంతోపాటు ఫ్యూచ‌ర్‌లో ఇలా జ‌ర‌గ‌కుండా చూస్తానంటూ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశార‌ట‌. పోనీ.. ఆ ఎమ్మెల్యే ఏమ‌న్నా.. ఆషామాషీనా అంటే ఆయ‌నే పెద్ద‌ టైగ‌ర్ ఎమ్మెల్యే! ఆయ‌న‌ను చూస్తే.. జిల్లా అధికారులు సైతం ఒణ‌కాల్సిందే. మ‌రి అలాంటి ఎమ్మెల్యేపై చంద్ర‌బాబు ఎందుకంత‌లా ఫైర‌య్యారో తెలియాలంటే.. ఇది చ‌ద‌వాల్సిందే!!

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు రాష్ట్రంలో ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. నీరు-చెట్టు, ఇంకుడు గుంత‌లు వంటి అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అదేవిధంగా ప్ర‌స్తుత వ‌ర్షాకాల సీజ‌న్‌ను దృష్టిలో పెట్టుకుని దోమ‌లపై దండ‌యాత్ర కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దీనిని భారీ ఎత్తున ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని డిసైడ్ అయ్యారు. దీనికి సాధ‌నంగా పాఠ‌శాల విద్యార్థుల‌ను చంద్ర‌బాబు ఎంచుకున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 24న ఏలూరులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా  ఏలూరు వచ్చిన చంద్రన్నకు ప్రజలు, విద్యార్ధుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. జడ్పీ కార్యాలయం నుంచి సురేష్ చంద్రబహుగుణ స్కూలు వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. దారి పొడుగునా భారీ ఎత్తున దోమ‌ల గురించి ప్ర‌చారం చేస్తూ.. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ ముందుకు సాగారు.

 ఇంత వ‌ర‌కు అధిరిపోయే ఏర్పాట్టు చేసిన అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు చంద్ర‌బాబు ఆ త‌ర్వాతే చుక్క‌లు చూపించారు. విద్యార్ధులతో క‌లిసి  సమావేశ ప్రాంగణానికి చేరుకున్న చంద్ర‌బాబు అక్కడి పరిస్థితి చూసి అవాక్కయ్యారు. మీటింగ్‌కు వచ్చిన విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉండటం, సమావేశ స్థలి పూర్తిగా ఖాళీగా ద‌ర్శ‌న మివ్వ‌డంతో చంద్ర‌బాబుకి బీపీ పెరిగిపోయింది. అంతే! ఒక్క ఉదుట‌న స్థానిక ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ని పిలిచి క్లాసిచ్చేశారు. మీటింగ్ ఏర్పాట్లు చూసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పిలిచి, ఇదే విషయం అడిగారట. పోలీసులు రానివ్వడం లేదని ఆయన సమాధానమిచ్చారట.

 దాంతో ముఖ్యమంత్రి కోపం మరింత పెరిగిందట. వెంటనే తన ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తంచేశారట. ప్రభాకర్ సమర్థించుకోవడానికి ఎంత ప్రయత్నించినా చంద్రబాబు వినలేదట. “విద్యార్థులందరికీ సెలవిచ్చాను. దాని అర్ధం ఇంటికి వెళ్లిపోమని కాదు.. మీటింగ్‌కు తీసుకురావాలని” అని ఘాటుగా అన్నారట. ఈ పరిణామంతో కంగుతిన్న చింతమనేని “సెక్యూరిటీ రీజన్స్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని” బదులివ్వబోయారు. అయినా చంద్రబాబు శాంతించ‌లేదు. దీంతో ఎమ్మెల్యేకి చెమ‌టలు ప‌ట్టాయ‌ట‌! ఇదీ మొత్తానికి చంద్రాబాబు త‌న పార్టీ నేత‌పై ఫైరైపోయిన సంగ‌తి!