ఎన్టీఆర్ కి చెప్పాలనుకుంటున్నాడట

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. వీరిద్దరి కాంబినేషన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజే వుంది. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చి చాల సంవత్సరాలే అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వినాయక్ మెగాస్టార్ ఖైదీ నెం.150 సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఈ సినిమా అవగానే ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ఆలోచనతో వున్నాడట వినాయక్. అదుర్స్ 2 కోసం ఎప్పుడో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట ఎన్టీఆర్ కి వినినిపించటమే బాకీ అన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న ఖైదీ నెం.150 పూర్తికాగానే అదుర్స్ 2 తో పాటు ఇంకో స్టోరీ కూడా ఎన్టీఆర్ కి వినిపించాలనుకుంటున్నాడట వినాయక్. చూదాం ఎన్టీఆర్ దేనికి పచ్చ జండా ఊపుతాడో మరి.