సైలెంట్‌గా చక్కబెట్టేస్తున్న ‘ధృవ’.

దసరా దగ్గరకొచ్చేస్తోంది, మెగా అభిమానుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. సినిమా రిలీజ్‌పై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ సినిమా షూటింగ్‌ మాత్రం శరవేగంగా జరుగుతుండడం గమనించదగ్గ విషయం. ఎవరేమనుకున్నాసరే అక్టోబర్‌లో, దసరాకి ముందే సినిమాని రిలీజ్‌ చెయ్యాలని రామ్‌చరణ్‌ అనుకుంటున్నాడు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా లేట్‌ అయ్యే ఛాన్సుందని టాక్‌ వినవస్తోంది. ఆ టాక్‌కి భిన్నంగా సినిమా షూటింగ్‌ని పూర్తి చేసేస్తున్నారట.

తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్‌’ చిత్రాన్ని తెలుగులోకి ‘ధృవ’ పేరుతో రామ్‌చరణ్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టైలిష్‌ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఈ సినిమాలో రాంచరణ్‌ లుక్స్‌ వెరీ వెరీ స్టైలిష్‌గా ఉండబోతున్నాయట. ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలో హీరో రామ్‌చరణ్‌కీ, విలన్‌ అరవింద్‌ స్వామికీ మధ్య మైండ్‌ గేమ్‌ తెలుగు ప్రేక్షకులకు థ్రిల్‌ ఇవ్వనుంది.

 తెలుగులో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు సినీ చరిత్రలో ది బెస్ట్‌ మూవీ కానుందని అంటున్నారు. ఆల్రెడీ తమిళంలో బిగ్గెస్ట్‌ అయినప్పటికీ ఈ సినిమాని తెలుగులో చాలా మార్పులు చేశారట. రాంచరణ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి చేస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం రాంచరణ్‌ తన బాడీ ఫిట్‌నెస్‌ దగ్గర్నుంచీ, ఆహారపు అలవాట్ల వరకూ ఎన్నో మార్పులు చేసుకున్నాడు. ఇన్ని స్పెషాలిటీస్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.