రొమాంటిక్‌ అవతారమెత్తిన చైతూ.

రొమాంటిక్‌ మూవీగా చైతూ సినిమా ‘ఏ మాయ చేశావె’ రొమాంటిక్‌ ప్రియులను బాగా ఆకర్షించింది. ఆ సినిమాతో చైతూ రొమాంటిక్‌ హీరోగా సెటిలైపోతాడనుకున్నారు అంతా. కానీ మాస్‌ హీరో అన్పించుకోవాలనే ప్రయత్నంలో కొంచెం తడబడ్డాడు. అయినా ‘తడాఖా’ రూపంలో నాగచైతన్యకి మంచి మాస్‌ హిట్‌ దక్కిందిలెండి. అయితే తిరిగి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌పై దృష్టి పెట్టిన ఈ అక్కినేని వారబ్బాయ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో కలిసి మాంఛి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నాడట.

ఈ సినిమా కోసం ‘ఒకసారి ఇటు చూడు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అతి త్వరలో ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్ళనుంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లా ఈ చిత్రాన్ని దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ డీల్‌ చేయనున్నాడని సమాచారమ్‌. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌ అదిరిపోయేలా ఉంటాయి. అయినా ఎక్కడా వల్గారిటీకి ఛాన్స్‌ ఇవ్వలేదు దర్శకుడు.

నాగార్జున లాంటి సీనియర్‌ హీరోతో, ఆ రేంజ్‌ రొమాన్స్‌ని అద్భుతంగా పండించిన కళ్యాణ్‌కృష్ణ, యంగ్‌స్టర్‌ నాగచైతన్యతో లక్కీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో ఇంకే రేంజ్‌లో రొమాన్స్‌ని తెరపై సృష్టిస్తాడోనని అంతా ఎదురుచూస్తున్నారు. పేరుకి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అయినా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తరహాలో అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునేలా ఈ సినిమాని కళ్యాణ్‌కృష్ణ రూపొందించనున్నాడట.