మెగా ఫాన్స్ ని టెన్షన్ పెడుతున్న వినాయక్ పంధా

చిరంజీవి 150 వ సినిమా దీనిగురించి గత కొన్న్ని సంవత్సరాగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్. మొత్తనికి మెగా ఫాన్స్ ఎదురుచూపు ఫలించింది 150 వ సినిమా స్టార్ట్ అయ్యింది అదీ మెగాస్టార్ కి ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వీ వీ వినాయక్ డైరెక్షన్లో దీంతో ఫాన్స్ లో ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇప్పుడు మాత్రం వినాయక్ డెసిషన్ వల్ల అభిమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.

వీ వీ వినాయక్ అనగానే పంచ్ డైలాగ్స్, గాల్లోకి సుమోలు లెగటం, నాటుబాంబులు గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు తీస్తున్న ఖైదీ నం.150 తమిళంలో విజయ్ హీరోగా నటించి, సూపర్ హిట్ అయిన కత్తి సినిమాకు రీమేక్ అని తెలిసిందే. తమిళ కత్తి సినిమాలో పంచ్ డైలాగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఐటమ్ సాంగ్ లేనే లేదు. ఓ భావోద్వేగమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా యిది.

అయితే వినాయక్ ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేసి తనదయిన స్టయిల్లో పంచ్ డైలాగ్స్, ఐటెం సాంగ్ తో సినిమాని తీస్తున్నాడని సమాచారం. అయితే ఈ మధ్య కలం లో ప్రేక్షకుల ఆలోచనలు మారిపోయాయి. వినాయక్ మార్క్ లో వచ్చే సినిమాలను అంతగా ఆదరించే పరిస్థితిలోలేరు. పెద్దపెద్ద పంచ్ డైలాగ్స్ ని రిసీవ్ చేసుకోవటం లేదు. అందుకే మెగా అభిమానుల్లో టెన్షన్ మొదలయింది. ఒక బలమయిన కథలో మెగాస్టార్ లాంటి నటుడు నటిస్తుంటే పంచ్ డైలాగ్స్ తో పనేముంది అనుకుంటున్నారు మెగా అభిమానులు.