మాజీ ప్రధాని మనవడితో తమన్నారొమాన్స్

మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ హీరోగా జాగువార్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెస్తున్నాడు డైరెక్టర్ మహాదేవ్. ఈ సినిమా ని కన్నడతో పాటే తెలుగు, తమిళ్ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా లో ఐటెం సాంగ్ చేయటానికి మిల్కీ బ్యూటీ తమన్నా రెడీ అయ్యింది. ముందుగా ఈ సాంగ్ ని శృతిహాసన్ తో చేయాలనుకున్నారు చిత్ర యూనిట్ దానికోసం రెండు కోట్ల రూపాయల పారితోషకం కూడా ఆఫర్ చేశారట అయితే డేట్స్ అద్జుస్త్ చేయలేక శృతి ఆ ఆఫర్ని వదులుకున్నదట. దీంతో ఆ బంపర్ ఆఫర్ని మిల్కి బ్యూటీ తమన్నా కొట్టేసింది.