బాహుబ‌లి-2 ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌

యావ‌త్ సౌత్ ఇండియా సినీ అభిమానుల‌తో పాటు నార్త్‌లో చాలా మంది సినీ అభిమానులు ఇప్పుడు బాహుబ‌లి-2 కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. వీరంతా బాహుబ‌లి-2 కోసం ఎందుకు అంత ఆస‌క్తితో ఉన్నారంటే వేరే చెప్ప‌క్క‌ర్లేదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న టెన్ష‌న్ అంద‌రిలోను ఉంది. ఇక ఆ మిస్టరీ గుట్టు విప్పేందుకు రాజమౌళి టీమ్‌ కూడా శరవేగంగా శ్రమిస్తోంది.‍

బాహుబ‌లి-2 షూటింగ్ దాదాపు పూర్త‌యిపోయింది. ఈ సినిమా  వ‌చ్చే యేడాది ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంద‌ని కూడా చిత్ర యూనిట్ డేట్ చెప్పేసింది. న‌వంబ‌ర్‌కు అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకుని త‌ర్వాత నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల మీద రాజ‌మౌళి దృష్టి పెట్టనున్నాడు. బాహుబ‌లి – ది బిగినింగ్‌ను మించేలా బాహుబ‌లి- ది క‌న్‌క్లూజన్ సీన్లు ఉండేలా రాజ‌మౌళి చిత్రీక‌రించాడ‌ట‌.

బాహుబ‌లి-2లో ప్ర‌భాస్‌-రానా యుద్ధం, ప్ర‌భాస్‌-అనుష్క యుద్ధం హైలెట్ అంటున్నారు. ఇక ఈ సినిమా గురించి ఓ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌ 23న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తున్నట్టు సమాచారం.

బాహుబ‌లి ట్రైల‌ర్ యూ ట్యూబ్‌ను ఎలా షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 24 గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్‌ 40 లక్షల వ్యూస్‌ సాధించింది. ఇప్పుడు బాహుబ‌లి-2 ట్రైల‌ర్ దానిని మించేలా సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుంన‌డంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు అంద‌రూ బాహుబ‌లి-2 ట్రైల‌ర్ కోసం ఉత్కంఠ‌తో ఉన్నారు. జ‌క్క‌న్న ఏ రేంజ్‌లో బాహుబ‌లి-2 ట్రైల‌ర్‌ను క‌ట్ చేయించాడో చూడాలి.