‘జనతా గ్యారేజ్‌’ లెక్కలు షాకింగే.

అంచనాల్ని మించి ‘జనతా గ్యారేజ్‌’ విజయపథాన దూసుకెళ్తోంది. ఈ సినిమా వసూళ్ళతో చిత్ర యూనిట్‌ చాలా హ్యాపీగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో ఎన్టీయార్‌ హీరోగా నటించగా, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించారు. నిత్యామీనన్‌, సమంత ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. అయితే తొలి రోజు డివైడ్‌ టాక్‌తో కొంచెం డీలాపడ్డ యూనిట్‌, తాజా వసూళ్ళతో పండగ చేసుకుంటోంది. ఆల్రెడీ ‘జనతా గ్యారేజ్‌’ 50 కోట్ల మార్క్‌ని టచ్‌ చేసిందనే టాక్‌ వినవస్తోంది. కానీ వాస్తవ లెక్కలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. 40 కోట్లకు చేరువగా వచ్చిందని అధికారిక లెక్కల ప్రకారం తెలియవస్తోంది.

 ఏదేమైనా డివైడ్ టాక్‌తో ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం పెద్ద విషయమే. ఎన్టీయార్‌ ఇమేజ్‌, దర్శకుడు కొరటాల శివపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్‌, వీటికి తోడు వరుస సెలవులు సినిమాకి వసూళ్ళ పంటని పండించాయి. అయినప్పటికీ సినిమా బిజినెస్‌ చాలా ఎక్కువగా జరగడంతో, ఈ వారం చేసే వసూళ్ళని బట్టి ‘జనతా గ్యారేజ్‌’ విజయాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇప్పటికి వినిపిస్తున్న లెక్కలు కూడా అందరికీ షాక్‌ ఇస్తున్నాయి. వచ్చిన టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ళు వస్తుండడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఇది ఎన్టీయార్‌ మేనియా అని చెప్పక తప్పదు.