చిరు 151వ సినిమా ఫిక్స‌య్యింది

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం పాలిటిక్స్‌ను కాస్త ప‌క్క‌న‌పెట్టి వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. దాదాపు 9 సంవ‌త్స‌రాల లాంగ్ గ్యాప్ త‌ర్వాత చిరు హీరోగా న‌టిస్తోన్న ఖైదీ నెంబ‌ర్ 150వ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. టాలీవుడ్లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు బాగా తెర‌కెక్కిస్తాడ‌ని పేరున్న వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే 150వ సినిమా త‌ర్వాత చిరు త‌న 151వ సినిమాను కూడా లైన్‌లో పెట్టేశారు. చిరు ఎప్పుడో త‌న 151వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఆ బాధ్యతలు కూడా పూర్తిగా అరవింద్‌కే అప్పగించారు. ఇక టాలీవుడ్ లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కూడా ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది.

యాక్ష‌న్ చిత్రాలు తెర‌కెక్కిస్తూ వ‌రుస హిట్లు కొడుతున్న బోయ‌పాటి శ్రీను ఈ స‌మ్మ‌ర్‌లో మెగా హీరో బ‌న్నీతో తెర‌కెక్కించిన స‌రైనోడు సినిమా సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రెండు రోజుల క్రితం బోయ‌పాటి చెప్పిన స్టోరీ లైన్ అర‌వింద్‌కు బాగా న‌చ్చింద‌ని…. అదే లైన్‌ను చిరుకు కూడా బాగా న‌చ్చ‌డంతో దాన్నే త‌న 151వ సినిమాగా చిరు ఓకే చేసిన‌ట్టు తెలుస్తోంది.

అప్పుడే బోయపాటికి అరవింద్‌ అడ్వాన్స్‌ కూడా ఇచ్చేసినట్టు సమాచారం. ప్రస్తుతం బోయపాటి-బెల్లంకొండ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. అది పూర్తయిన వెంటనే చిరు సినిమా కోసమే బోయపాటి పనిచేస్తాడట.