క్లైమాక్ లోరెడ్డి వ‌ర్సెస్ క‌మ్మ పోరు

స‌మైక్యాంధ్ర‌కు 9 సంవ‌త్స‌రాలు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత ఏపీకి మాత్రం సీఎం అయ్యారు. చాలా గ్యాప్ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు ప‌ద్ధ‌తిగా ప‌నులు చేసుకుంటూ ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు సంపాదించుకోవాల్సింది పోయి కీచులాట‌ల‌కు దిగుతున్నారు. ప్ర‌స్తుతం టీడీపీలో అన్ని జిల్లాల్లోను ఈ కీచులాట‌లు కామ‌న్ అయ్యాయి.

నిన్న‌టి వ‌ర‌కు ఈ కీచులాట్లో జిల్లాల్లో ఆధిప‌త్యం కోసం నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎత్తుకు పైఎత్తులు వేసుకునేవారు. అయితే ఇప్పుడు పార్టీలో కొత్త‌గా కుల వివాదాల ర‌గ‌డ రాజుకుంది. అనంత‌పురం జిల్లాలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీనియ‌ర్ పొలిటిషీయ‌న్ జేసీ దివాక‌ర్‌రెడ్డి పార్టీ మారి టీడీపీలోకి జంప్ చేశారు. జేసీ ఎంపీగాను, ఆయ‌న సోద‌రుడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగాను విజ‌యం సాధించారు. అయితే అప్ప‌టి నుంచి జేసీకి అనంత‌పురం ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్‌చౌద‌రికి అస్స‌లు పొస‌గ‌డం లేదు.

వీరిద్ద‌రు వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా ఒక‌రిని మ‌రొక‌రు విమ‌ర్శించుకుంటూనే ఉంటున్నారు. తాజాగా ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి కుల చిచ్చు రేపారు. అనంతపురంలో అంటువ్యాధులు ప్రబలడానికి స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం కూడా కారణమంటూ దివాకర్‌ రెడ్డి విమర్శలు చేశారు. అనంత కార్పొరేష‌న్ వెన‌క‌ప‌డిపోవ‌డానికి కుల గ‌జ్జి పెర‌గ‌డ‌మే కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌లు చేశారు. జేసీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రితో పాటు మేయ‌ర్ మ‌ద‌మంచి స్వ‌రూప‌, క‌మిష‌న‌ర్ ముగ్గురు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికే చెందిన వారు కావ‌డంతో వారిని టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు.

అయితే ఇందుకు ప్ర‌తిగా జేసీపై మేయ‌ర్ స్వ‌రూప‌తో పాటు ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్‌చౌద‌రి ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పాల‌న‌లో మంత్రి, క‌మిష‌న‌ర్‌, ఎమ్మెల్యే అంద‌రూ ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కాదా ? అని స్వ‌రూప ఫైర్ అయ్యారు. ఇక ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి మాట్లాడుతూ జేసీ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండాల‌ని లేనిప‌క్షంలో క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి ఫిర్యాదు చేస్తాన‌న్నారు. ఇలా అనంత టీడీపీలో ఇప్పుడు రెడ్డి వ‌ర్సెస్ క‌మ్మ పోరు జ‌రుగుతోంది.

పార్టీ బ‌లంగా ఉన్న అనంత‌లో నాయకులు ఏకంగా కులాల‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేసుకుంటూ …వాదోప‌వాదాల‌కు దిగుతుంటే బాబు చూస్తూ ఊరుకుంటే అది పార్టీతో పాటు ఆయ‌న‌కు కూడా న‌ష్టం క‌లిగించడం ఖాయంగా క‌నిపిస్తోంది. బాబు ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్ట‌క‌పోతే మ‌రి కొంద‌రు నాయ‌కులు ఈ భాట‌లో న‌డిచే ఛాన్సులు లేక‌పోలేదు.అయినా ఫిరాయింపులను ప్రోత్సహించడం లో బిజీగా వున్నా చంద్రబాబు ఈ కుమ్ములాటల్ని పట్టించుకునే టైం ఎక్కడుంది అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.