అల్లు స్నేహా రెడ్డి ఐడియా అదుర్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పట్టిందల్లా బంగారమే అవుతోంది.లేకపోతే సరైనోడు ఎక్కడ చూసినా అంత నెగిటివ్ టాక్ వచ్చినా 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ఇంకేమనాలి.అలా కెరీర్ లో పీక్స్ లో ఉన్న బన్నీ వ్యక్తిగత జీవితం లో కూడా కంప్లీట్ మాన్ అనిపించుకున్నాడు.ఇప్పటికే అల్లు అయాన్ రూపంలో ఓ బుజ్జి బుడతడి సందడిలో మునిగి తేలుతున్న అల్లు వారింట బన్నీ స్నేహాల జంట త్వరలో మరో పండంటి బిడ్డకు వెల్కమ్ చెప్పనుంది.

మరో వైపు మిస్సెస్ అల్లు అర్జున్ అయిన అల్లు స్నేహా రెడ్డి సరికొత్త ఐడియా తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది.ఎంతో మంది స్టార్ట్ అప్ ల పేరుతో తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే స్నేహా రెడ్డి కూడా తానేం తక్కువా అంటూ ముందుకొచ్చింది.పిక్ అబూ పేరుతో ఆన్లైన్ ఫోటో స్టూడియో ను స్టార్ట్ చేసింది.

ఈ విషయాన్నీ స్వయంగా అల్లు అర్జున్ షేర్ చేసాడు.తన లైఫ్ పార్టనర్ అల్లు స్నేహా రెడ్డి పిక్ అబూ అనే స్టార్ట్ అప్ తో మనముందుకొచ్చిందనీ క్రియేటివ్ ఫొటోస్ అండ్ మెమోరీస్ కోసం ఈ పిక్ అబూ అందరికీ ఉపయోగపడుతుంది అంటున్నాడు బన్నీ.ఐడియా, క్రియేటివిటీ అంతా బాగానే వుంది కానీ దీన్ని ఇంకెంత క్రియేటివ్ గా ముందుకుతీసుకెళ్తారో చూడాలి.అయినా కెరీర్ లో సక్సెస్ కి చిరునామా అయిన భర్త అల్లు అర్జున్,మామ అల్లు అరవింద్ ల నుండి ఆ సక్సెస్ మంత్రం స్నేహా రెడ్డి కి ఈపాటికే తెలిసే ఉంటుంది కదూ.