అమెరికాలో ఎన్టీయార్‌ కుమ్మేశాడంతే.

అమెరికాలో 12 కోట్ల వసూళ్ళతో ఎన్టీయార్‌ తన స్టామినాని చాటి చెప్పాడు. ఎన్నో ఏళ్ళుగా తన రేంజ్‌ హిట్‌ కోసం ఎదురుచూసిన ఎన్టీయార్‌, ఆ కరువు తీరిందని ఇటీవలే ప్రకటించాడు. అయితే ఎన్టీయార్‌ అంచనాల్ని మించి ‘జనతా గ్యారేజ్‌’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. అమెరికాలో సాధించిన 12 కోట్ల వసూళ్ళే దీనికి నిదర్శనం. 80 కోట్ల క్లబ్‌లో ఇప్పటికే చేరిపోయిన ‘జనతా గ్యారేజ్‌’ ముందు ముందు సృష్టించబోయే సంచలనాలు ఎలా ఉంటాయో.

ఈ సినిమాతో ఎన్టీయార్‌ మాత్రమే కాదు, కొరటాల శివ కూడా హ్యాట్రిక్‌ కొట్టేశాడు. ఎన్టీయార్‌కి ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు. అలాగే, కొరటాల శివకి ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాలు సూపర్‌ హిట్లు. వసూళ్ళ వరకు టాలీవుడ్‌ టాప్‌ 3లో రెండు సినిమాలు కొరటాల శివవే ఉన్నాయి. వసూళ్ల విషయం పక్కన పెడితే ఈ రెండు సినిమాలు మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలే. అయినా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ‘

శ్రీమంతుడు’ సినిమా మహేష్‌ కెరీర్‌లో ది బెస్ట్‌ అన్పించుకోగా, ‘జనతా గ్యారేజ్‌’ ఎన్టీఆర్‌ కెరీర్‌లో ది బెస్ట్‌ మూవీ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ తదుపరి చిత్రంపై క్లారిటీ లేదు. ఈ సినిమా సాధించిన హైప్‌తో నెక్స్ట్‌ మూవీకి ఏ తరహా కథని ఎంచుకోవాలో తెలీని సందిగ్థంలో ఎన్టీఆర్‌ ఉన్నాడనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఎన్టీఆర్‌ నుండి మరో అద్భుతమైన మూవీ రావచ్చని అంచనా వేస్తున్నారు అభిమానులు.