బాబు బంగారం TJ రివ్యూ

సినిమా:బాబు బంగారం
టాగ్ లైన్:బంగారం కాదు కానీ..బానే వుంది
TJ రేటింగ్ :3/5

నటీ నటులు: వెంకటేష్, నయనతార, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి,పృథ్వి,..
నిర్మాత:చినబాబు
బ్యానర్: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
మ్యూజిక్: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌
ఎడిటింగ్ : ఉద్ద‌వ్‌.ఎస్‌.బి
కథ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్ :మారుతి

వెండితెరపై చాన్నాళ్ల తరువాత విక్టరీ వెంకటేష్ ని చూడడం రిలీజ్ కి ముందే ఆసక్తిని రేకెత్తించింది బాబు బంగారం సినిమా.ట్రైలర్ చూసాక సినిమాపైన అంచనాలు మరింత పెరిగాయి.ట్రైలర్ లోనే సినిమా ఏంటో చూపించేసారు.వెంకటేష్ ఫామ్ లో వున్నప్పుడు ఎలా వుండేవాడో అచ్చం అలాగే ఉంటాడీ బాబు బంగారం.సింపుల్ గా చెప్పాలంటే బాబు బంగారం వేంకటేష్ వన్ మాన్ షో లాంటి సినిమా.

సినిమా ఆద్యంతం వెంకటేష్ హావభావనాలు..ట్రేడ్ మార్క్ వెంకీ ఎక్స్ప్రెషన్స్ తోనే సగం సినిమా నడిచిపోతుంది.ఈ మధ్యన యూత్ఫుల్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రసుగా నిలిచిన మారుతి ఫస్ట్ టైం పెద్ద స్టార్ తో సినిమా ఛాన్స్ కొట్టేసాడు.ఎంతో జాగ్రత్తగా సినిమాని మారుతి డీల్ చేసాడని చెప్పొచ్చు.ఎక్కడా పెద్ద పెద్ద ప్రయోగాలకు తావీయకుండా రొటీన్ గానే చెప్పినా వెంకటేష్ ను ప్రేక్షకులు ఎలా వూహించుకుంటారో దాన్నే తెరపై ఆవిష్కృతం చేసాడు మారుతి.

ఓ జాలిగల పోలీస్ ఆఫీసర్ జాలి చేతకానితనంగా మారితే వెజ్ తినే సింహం నాన్వెజ్ తినటం మొదలు పెట్టినట్టు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కథకి ఎలా ముగింపు ఇచ్చాడన్నదే కథాంశం..వెంకటేష్ సింప్లి సూపర్బ్ అనిపించాడు ఎప్పటిలాగే.ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ లో వెంకీ కనిపిస్తాడు.1st హాఫ్ అంతా జాలి తో నిండిన పోలీస్ అయితే..సెకండ్ హాఫ్ లో మాత్రం రౌడీల మక్కెలిరగదీసే పోలీసుగా కనిపిస్తాడు.మధ్యతరగతి అమ్మాయిగా నయనతార అందం అభినయంతో ఆకట్టుకుంటుంది.బత్తాయి బాబ్జిగా పృద్వి అలరించాడు. చాన్నాళ్ల తరువాత బ్రహ్మానందం పెద్ద సినిమాలో దర్శనమిచ్చాడు.ఉన్నంతసేపు బ్రహ్మి తన మార్క్ కామెడీ పండించాడు.మిగిలిన వాళ్లలో వెన్నెల కిషోర్ ,సంపత్ రాజ్,పోసాని ముఖ్య పాత్రలలో బాగానే మెప్పించారు.

మారుతి మొదటి సారి పెద్ద స్టార్ ని హేండిల్ చేసిన టెన్షన్ మనకి కనిపిస్తుంది.ఎంతో జాగ్రత్తగా మరింత భయంగా ప్రతి సీన్ రొటీనేగా వున్నా పర్లేదు మిస్ ఫైర్ అవ్వకుంటే చాలు అన్నట్టే మొత్తం సినిమాని హేండిల్ చేసాడు మారుతి.ఏది ఏమైనా మారుతి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అని మరో సారి ప్రూవ్ చేసుకున్నాడు.వెంకటేష్ మార్క్ ఫామిలీ స్టోరీకి చిన్న క్రైమ్ కం పోలీస్ యాంగిల్ ని జతచేసి మారుతి సేఫ్ గా సినిమాను తీసుకెళ్లాడు.

పైన చెప్ప్పినదంతా ఒకెత్తయితే సినిమాని ఇంకాస్త బెటర్గా హేండిల్ చేసుండొచ్చు .ముక్యంగా స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్ గా ఉంటే బావుండేది.ఇంకా కామెడీ పంచ్ లు పడుంటే మరింత హైట్స్ కి వెళ్ళేదీ బంగారం.అందరు కమెడియన్స్ వున్నా పూర్తి స్థాయిలో కామెడీ పేలలేదనే చెప్పాలి.సినిమాలో ఫైట్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి.ఎందుకంటే అవి బాలేవా అంటే బానే వున్నాయి కానీ ప్రతి ఫైట్ స్లో మోషన్ లో రౌడీలు బంతుల్లా కింద పడి పైకి లేవటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద అసెట్ లా నిలబడింది .మ్యూజిక్ బాగుంది.బాక్గ్రౌడ్ మ్యూజిక్ థీమ్ కి తగ్గట్టుగా వుంది.పాటలు బానే వున్నాయి.

ఓవర్ అల్ గా బాబు బంగారం వెంకీ మార్క్ కామెడీ కం ఫామిలీ మూవీ.తెరపై వెంకటేష్ ఎనర్జీ సినిమాకి బానే వసూళ్లు రాబట్టే అవకాశం వుంది.మారుతి మార్క్ అడల్ట్ కామెడీ పక్కన పెట్టి క్లీన్ ఎంటర్టైనర్ గా బాబు బంగారం ని డీల్ చేసాడు మారుతి.బాబు బంగారం తరువాత మారుతి కి మరిన్ని పెద్ద ఆఫర్స్ వస్తాయనుకోవచ్చు.