సమంత, నిత్యా కాంబో సెంటిమెంట్‌

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం నటిస్తోంది. సినిమాకి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటన ఒక ఎత్తైతే, మలయాళ్‌ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటన మరో ఎత్తు. ఇద్దరికిద్దరూ పోటీ పడి నటించారట ఈ సినిమాలో. సమంత, నిత్యామీనన్‌ పాత్రలు కూడా తమ అందచందాలతో ఆకట్టుకోవడమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉండేలాగే డిజైన్‌ చేశారట.

అంతేకాదు ఈ సినిమాలో భారీ డైలాగులు, భారీ భారీ సెట్టింగులతో ఫైట్లు అదిరిపోయాయట. ఈ నెల 12న ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను కూడా భారీగానే చేయనున్నారట. అంతే కాదు డిఫరెంట్‌గా ఈ ప్రోగ్రామ్‌ని ప్లాన్‌ చేస్తున్నారట చిత్ర యూనిట్‌. ఇంత వరకూ ఎన్టీఆర్‌ చేసిన డాన్సుల్లో పోలిస్తే ఈ సినిమాలో డాన్సులు చాలా బాగా చేశాడంట ఎన్టీఆర్‌. అంతేకాదు మాస్‌ డాన్సుల్లో హీరోయిన్‌ సమంత కూడా తన డాన్సింగ్‌ టాలెంట్‌ని చూపించిదట.

సమంత, నిత్యామీనన్‌లు కలిసి నటించిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా ఘన విజయం సాధించింది. అలాగే ఆ సెంటిమెంటు వర్కవుట్‌ అయ్యి ఈ సినిమాకి కూడా హిట్‌ గ్యారంటీ అంటున్నారు ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ‘టెంపర్‌’, నాన్నకు ప్రేమతో’ సినిమాలతో సూపర్‌ హిట్‌లను అందుకున్న ఎన్టీఆర్‌కి ఈ సినిమా హిట్‌పై కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కాజల్‌ ఐటెం సాంగ్‌ ప్రత్యేక ఆకర్షణ కానుంది.