శ్రీరస్తు శుభమస్తు TJ రివ్యూ

సినిమా:శ్రీరస్తు శుభమస్తు
టాగ్ లైన్:శిరీష్ కెరీర్ కి కళ్యాణమస్తు 
TJ రేటింగ్:3.25/5

బ్యానర్: గీతా ఆర్ట్స్
నటీనటులు: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావూ రమేష్, తనికెళ్ళ భరణి,సుమలత, ఆలీ, సుబ్బరాజు తదితరులు
సంగీతం: థమన్
నిర్మాత: అల్లు అరవింద్
దర్శకత్వం: పరశురామ్

మధ్యతరగతి అమ్మాయిలు డబ్బున్న అబ్బాయలనే లవ్ చేస్తారనేది తప్పు అని నిరూపించే లైన్ తో ఈ సినిమా తీశారు డైరెక్టర్ పరశురామ్. ఇందులో డబ్బున్న కుటుంభం లోంచి వచ్చిన అబ్బాయి గా అల్లు శిరీష్, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా లావణ్య త్రిపాఠి నటించారు.

గౌరవం, కొత్తజంట సినిమాలతో హీరోగా నటించిన అల్లు శిరీష్ ఈ సినిమా తో హీరోగా సెటిల్ అయ్యాడనే చెప్పాలి. ఇంతకు ముందు చేసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా లో శిరీష్ బాగా ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తుంది. ఇంకా లావణ్య త్రిపాఠి మధ్యతరగతి అమ్మాయిగా చాలాబాగా సూట్ అయింది.

సినిమా ఫస్ట్ హాఫ్ చాల కూల్ గా కామిడీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ పాత సినిమాలలోని ఫ్లేవర్ కనిపిస్తుంది. అక్కడక్కడా కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఎక్కడ బోర్ అనిపించకుండా బాగానే వుంది. ఇంకా క్లైమాక్స్ ముందు వచ్చే సన్ని వేశాలలో రావు రమేష్ డైలాగ్స్ చాల బావున్నాయి అలాగే శిరీష్ డైలాగ్స్ కూడా బావున్నాయి.

ఈ సినిమాలో సీనియర్ నటులయిన తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, రావు రమేష్, క్యారెక్టర్స్ సినిమా కి చాల పెద్ద ప్లస్ పాయింట్. డబ్బున్న తండ్రిగా ప్రకాష్ రాజ్ రెగ్యులర్ రోల్ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్ ఆయనే చేయాలి అనేలా మెప్పించారు. తనికెళ్ళ భరణి హీరోయిన్ తండ్రికి మంచిస్నేహితుని పాత్ర లో నటించారు. ఇంకా రావు రమేష్ క్యారెక్టర్ సినిమాకి పెద్ద ప్లస్ అనిచెప్పాలి. మధ్యతరగతి అమ్మాయికి తండ్రిగా రావు రమేష్ నటించడం కంటే జీవించారని చెప్పాలి. రావు రమేష్ డైలాగ్స్ చాల బాగున్నాయి.

కమెడియన్స్ గా ఆలీ, ప్రభాస్ శీను, సత్యం రాజేష్ నటించారు. ఫస్ట్ హాఫ్ లో సత్యం రాజేష్, ప్రభాస్ శీను కామిడీ చాల బావుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆలీ కామిడీ అలరించింది.మొత్తానికి శ్రీరస్తు శుభమస్తు అల్లు శిరీష్ కి మంచి బ్రేక్ ఇస్తుందనే చెప్పాలి.ఓవర్ అల్ గా ఫస్ట్ హాఫ్ సరదాగానూ సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ గాను ఇంకొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది.