విక్రమ్‌కి గెలుపు దక్కేనా?

విక్రమ్‌ హీరోగా మరో సైంటిఫిక్‌ మూవీ తెరకెక్కుతోంది. ప్రయోగాత్మక సినిమాలకు విక్రమ్‌ పెట్టింది పేరు. ‘అపరిచితుడు’తో విక్రమ్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ‘ఐ’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను నమోదు చేసింది. కానీ విజయంలో ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు మరో ప్రయోగంతో ముందుకొస్తున్నాడు విక్రమ్‌. అదే ‘ఇంకొక్కడు’ సినిమా.

ఈ సినిమాలో విక్రమ్‌ ‘భారత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌కి సంబంధించిన అధికారిగా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. విక్రమ్‌కి ‘అపరిచితుడు’ వంటి విజయాన్ని తెచ్చిపెట్టనుందని ఆశిస్తున్నారు అంతా. విక్రమ్‌ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మధ్య వరుస అపజయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు విక్రమ్‌. సో ఈ సినిమా విజయం విక్రమ్‌కి తప్పనిసరి. అంతేకాదు భారీ బడ్జెట్‌ మూవీగా కూడా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు విక్రమ్‌. అంతేకాదు పాజిటివ్‌ అండ్‌ నెగిటివ్‌ రోల్‌లో కూడా కనిపిస్తాడట. ఈ సినిమాలో నిత్యామీనన్‌, నయనతారలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిత్యామీనన్‌ ఈ సినిమాలో అండర్‌ కాప్‌ క్యారెక్టర్‌లో అధికారిణి పాత్రలో కనిపిస్తోంది ట్రైలర్‌లో. అంతేకాదు ప్రస్తుతం నయనతార నటించిన సినిమాలన్నీ విజయం దిశగా పరుగులు పెడుతున్నాయి. సో నయన్‌ లక్‌ విక్రమ్‌కి కలిసొస్తుందో లేదో చూడాలి.