నిహారిక కొట్టేసిన బంపర్ ఆఫర్ ఇదే.

చిరంజీవి 150వ సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా కనిపిస్తారు. నిహారికతో సహా అనే రూమర్స్‌ వచ్చాయి ఇంతవరకూ. అయితే ఈ విషయంపై ఇంతవరకూ క్లారిటీ లేదు. కానీ మెగా హీరోయిన్‌ నిహారికికు మాత్రం ఈ సినిమాలో క్యారెక్టర్‌ కన్‌ఫామ్‌ అయ్యిందట. చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాలో నిహారిక ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందట. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తదుపరి చిత్రం కోసం కథల ఎంపికలో బిజీగా ఉంది.

పెదనాన్న చిరంజీవి సినిమాలో ఛాన్స్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇదివరకే చెప్పిన నిహారిక, ఆ ప్రయత్నాల్లో సక్సెస్‌ అయ్యిందట. అయితే ఏ పాత్ర అనేది ఇంకా తెలియరావడంలేదు. అయితే ముఖ్యమైన పాత్రే అయి ఉంటుందని సమాచారమ్‌. పెదనాన్న సినిమాలో, అది కూడా పెదనాన్న చిరంజీవి 150వ చిత్రంలో ఛాన్స్‌ అంటే అది మెగా ఛాన్స్‌ కాకుండా ఎలా ఉంటుంది? ఇదే నిహారికకు రెండో సినిమా కూడా కానుందన్న మాట. అయితే రెండో సినిమాలో నిహారిక ఒక లవ్‌ స్టోరీలో నటించబోతోందనే సమాచారం తెలియ వస్తోంది. త్వరలోనే నిహారిక రెండో సినిమా గురించి వివరాలు బయటికి రానున్నాయి.