నిజమే తెరాస బాలయ్యే

బాలయ్య రూటే సపరేటు..అది సినిమా అయినా..రాజకీయమైనా.ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతారో ఆయనకే తెలీదు.ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసు కానీ ఎక్కడ ముగించాలో తెలీదు.స్టార్ట్ చేసాడంటే మాత్రం డబిడ దిబిడే.అదీ బాలయ్య స్టైల్ మరి.అదే బాలయ్యకు అప్పుడప్పుడు చిక్కులు కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది.ప్రెస్ మీట్ లలో బాలయ్య ఇలానే నోరు జారి ఇటు వ్యక్తిగతంగాను అటు టీడీపీ పార్టీ పరంగాను ఇబ్బదుల్ని ఎన్నో సార్లు ఎదుర్కొన్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య నిన్న కృష్ణ పుష్కరాల సందర్బంగా మహబూబ్ నగర్ జిల్లా సోమశిలలో పుష్కర స్నానం చేశారు.ఇందులో వింతేముంది అనుకుంటున్నారా!అదే కదా బాలయ్య స్పెషల్.బాలయ్య వస్తున్నట్టు ఎక్కడా టీడీపీ శ్రేణులకు సమాచారమే లేదు.మొత్తం బాలయ్య పుష్కర టూర్ అంత తెరాస పార్టీ దగ్గరుండి చూసుకుంది.

బాలయ్య రావడమే నేరుగా కొల్లాపూర్ లోని కేయల్ఐ అతిధి గృహాన్ని వచ్చారు.ఆయనకు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణ రావు సదర స్వాగతం పలికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు.తరువాత జూపల్లి,బాలకృష్ణ ఒకే వాహనం లో సోమశిల చేరుకున్నారు.మొత్తం బాలయ్య టూర్ అంత తెరాస నాయకులే బాలకృష్ణ వెంట ఉండి మరీ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు.

అయితే బాలయ్య వైఖరిపై టీడీపీ మండల అధ్యక్షుడు,కార్యకర్తలు,బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.అయినా మీ పిచ్చి కానీ బాలయ్యకు ఇదేమైనా కొత్తా!మీరు ఇలా లేని పోనీ కొత్త కొత్త అలవాట్లు బాలయ్యకి పరిచయం చేయాలని ట్రై చేయకండి..బాలయ్యకి చిర్రెత్తుకొస్తే వ్యవహారం ఇంకోలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా.