నయీమ్ ని ఎంచుకున్న RGV

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రామ్ గోపాల్ వర్మ తీరే వేరు. ఎప్పుడు ఎదో ఒక కాంట్రవర్సీ తో జనాల నోట్లలో నానుతూనే ఉంటాడు.  తీసే సినిమాలు కూడా అలాగే ఎదో ఒక కాంట్రవర్సియల్ టాపిక్ తో తీయడానికే ఇష్టపడతాడు రక్త చరిత్ర సినిమా కూడా అలా తీసిందే. ఇప్పుడు గ్యాంగ్ స్టర్ నయీమ్ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తానని ప్రకటించాడు డైరెక్టర్ ఆర్జీవీ.

మొత్తం మూడు పార్టులుగా సినిమా ఉంటుందని ట్వీట్ చేశాడు. రక్తచరిత్ర కేవలం రెండు భాగాలు మాత్రమేనని.. ఇది మూడు పార్టులైతే కానీ పూర్తి విషయాన్ని చెప్పలేమని.. నయీమ్ జీవితంలో అంత విషయముందన్నాడు. నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్ గా.. ఆపై గ్యాంగ్ స్టర్ గా నయీముద్దీన్ ఎదిగిన తీరు భయకంపితులను చేస్తోందన్నాడు. సమాచారం సేకరించే కొద్దీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయన్నాడు.