నయీం వేటలో రామ్‌ గోపాల్‌ వర్మ.

నటీ నటుల ఎంపికలో వర్మ స్టైలే వేరు. అప్పుడు ‘రక్త చరిత్ర’ సినిమాలో పరిటాల రవి క్యారెక్టర్‌ కోసం బాలీవుడ్‌ నటుడ్ని దించాడు. ఈ పాత్రకు వివేక్‌ని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే మద్దెలచెరువు సూరి పాత్రలో సూర్యను కూడా ఎవ్వరూ ఊహించలేదు. అటువంటి గొప్ప నటులతో ఆ సినిమాను వర్మ ఎంతగానో రక్తి కట్టించాడు. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్‌ నయీం పాత్రలో నటించే సరైన నటుడి కోసం గాలింపు మొదలెట్టేశాడు. యూనివర్సల్‌ అప్పీల్‌ కోసం వర్మ ట్రై చేస్తున్నాడు. అందుకే అందుకు తగ్గ నటుడి కోసం టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో, బాలీవుడ్‌లో వెతుకులాట కొనసాగించాడు.

ఇప్పటికే సదరు ఇండస్ట్రీల నుండి ఒక్కొక్కరిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిపై ఆడిషన్‌ చేయనున్నాడు వర్మ. ఈ సినిమాను ఎలాగూ ఈ మూడు భాషల్లోనూ విడుదల చేస్తాడట వర్మ. అందుకే మూడు భాషల్లోనూ పాపులర్‌ అయిన నటుడ్ని ఈ సినిమాలో నయీం పాత్ర కోసం ఎంచుకోవాలి. వర్మ ఆలోచనలు అందుకోవడం ఎవ్వరి వల్లా కాదు. అలాంటి ఆలోచనలతోనే సెన్సేషన్‌ సృష్టిస్తూ ఉంటాడు. ఏదో మాయ చేస్తాడు. ఆ మాయలో ఎలాంటి వారైనా పడాల్సిందే. అలాగే అప్పుడు రక్త చరిత్రతో కొట్టాడు. ఇప్పుడు నయీం చరిత్రతో కొట్టనున్నాడు. మరి ఇప్పుడు నయీం పాత్ర కోసం ఏ నటుడ్ని దించుతాడో వర్మ చూడాలిక.