నయనతార పోలిటిక్స్

తెలుగు,తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార ఎప్పుడు పలు వివాదాలను, ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఆమె అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, పెద్ద హీరోల సినిమాలకు సైతం ప్రమోషన్స్ కి రాకుండా నాదారి నాదే అన్నట్టుగా వ్యవహరిస్తోంది.

అలాంటి నయనతార ఈమధ్య తమిళనాట జరిగే రాజకీయ కార్యక్రమాలకు మాత్రం తప్పకుండా హాజరవుతుందట. పైగా ఆ కార్యక్రమాలకి హాజరయ్యేటప్పుడు మోడరన్ డ్రెస్ లలో కాకుండా హుందాతనంగా వుండే రెగ్యులర్ పొలిటికల్ లీడర్స్ వాడే దుస్తుల్లో పక్కా రాజకీయనాయకురాలిలాగా హాజరవుతుందట.

ఈమధ్య తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొంది. సొంత సినిమా ప్రమోషన్లకే హాజరుకాని నయనతార ఇలాంటి ఫంక్షన్లకు హాజరుకావడంతో అక్కడి జనాలలో ఆశక్తి రేకిస్తోంది. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డిఎంకె అధ్యక్షురాలు అయిన జయలలిత బాటలోనే నయన్ కూడా ప్రయాణించేటట్లుంది.