దీపికా ది స్పెషల్‌ క్వాలిటీస్‌

బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనె ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘ట్రిప్లెక్స్‌ ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ అనే సినిమాతో హాలీవుడ్‌లో తన హవా చాటడానికి రెఢీ అవుతోంది. ఎలాంటి పాత్రనైనా టేకప్‌ చేయగల టాలెంట్‌ ఉంది దీపికాలో. ఆ టాలెంట్‌తోనే ప్రపంచం చుట్టేస్తోంది ముద్దుగుమ్మ.

హీరోయిన్‌ అన్పించేసుకోవడానికి ఏదో ఒక సినిమాలో నటించేస్తే సరిపోతుంది అని అనుకోదంట దీపికా. తాను ఎంచుకున్న సినిమాలో తన పాత్ర తనకు ఎంతో నచ్చి, ఆ పాత్రకు తాను మాత్రమే సూటవుతాను అని అన్పిస్తేనే అందుకు సైన్‌ చేస్తుందట ముద్దుగుమ్మ దీపికా. అలా నటించిన పాత్రలు కాబట్టే ఆ పాత్రలకు జీవం పోసినట్లవుతుంది నా నటనలో అంటుంది ఈ పొడుగు కాళ్ల సుందరి. ఆ మధ్య తెలుగులో మహేష్‌ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి.

కానీ ఆమెకు ఆ సినిమాలో తన పాత్ర పట్ల అంతగా తృప్తి లేకపోవడం వల్లే నో చెప్పిందట. కానీ టాలీవుడ్‌లో తాను నటించకూడదనే ఆంక్షలేమీ లేవంటోంది. తనకు తగ్గ పాత్ర వస్తే తప్పకుండా నటిస్తానంటోంది. తెలుగు ప్రజలంటే తనకు ఎప్పుడూ అభిమానమే అంటోంది కూడా. ప్రస్తుతం అయితే బాలీవుడ్‌ నుండి కూడా కొంచెం గ్యాప్‌ తీసుకున్న దీపికా, ఈ సినిమా తరువాత మరో హాలీవుడ్‌ మూవీకి సైన్‌ చేసిందని సమాచారమ్‌.